AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Wagonr: మారుతి వ్యాగన్‌ ఆర్‌ నెంబర్‌ వన్‌.. దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కారు.. దీనికి కారణాలు ఏంటో తెలుసా..?

Maruti Suzuki Wagonr: ఏప్రిల్‌లో బెస్ట్ సెల్లింగ్ వాహనాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతీ సుజుకి కంపెనీకి చెందిన

Maruti Suzuki Wagonr: మారుతి వ్యాగన్‌ ఆర్‌ నెంబర్‌ వన్‌.. దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కారు.. దీనికి కారణాలు ఏంటో తెలుసా..?
Maruti Suzuki Wagonr
uppula Raju
|

Updated on: May 07, 2022 | 4:36 PM

Share

Maruti Suzuki Wagonr: ఏప్రిల్‌లో బెస్ట్ సెల్లింగ్ వాహనాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతీ సుజుకి కంపెనీకి చెందిన వ్యాగన్ఆర్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్‌లో మారుతీ మొత్తం 17,766 వ్యాగన్ఆర్ కార్లను విక్రయించగా మార్చి నెలలో ఈ సంఖ్య 24 వేలకు పైగా ఉంది. ఏప్రిల్ 2021 గురించి మాట్లాడినట్లయితే ఈ సంఖ్య 18,656 యూనిట్లుగా ఉంది. వ్యాగన్ R కారు ఎల్లప్పుడూ అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటి. దీని వెనుక రహస్యం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దేశంలో అత్యధికంగా ఇష్టపడే కార్లలో వ్యాగన్ఆర్ పేరు మొదటి స్థానంలో ఉంది. దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

1. తక్కువ ధర

1999 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వ్యాగన్‌ ఆర్‌ కారు అనేక వేరియంట్లు, మోడల్స్‌లో వినియోగదారులని ఆకట్టుకుంది. కాలానుగుణంగా వచ్చిన మార్పులు జనంలో బాగా పాపులర్ అవుతున్నాయి. దీని అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లు. వ్యాగన్ఆర్ LXi వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.47 లక్షలు అయితే దాని టాప్ వేరియంట్ వ్యాగన్ఆర్ ZXI ప్లస్ AT డ్యూయల్ టోన్ అని పిలుస్తారు. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.10 లక్షలు. ఇందులో మీరు ఒకటి కంటే మెరుగైన ఫీచర్లను పొందుతారు. ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ 2 నెలలుగా ఉంది.

2. CNGలో ఉత్తమ మైలేజ్

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ప్రజలు సీఎన్‌జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. CNG పెట్రోల్ డీజిల్ కంటే మైలేజీ పరంగా మెరుగ్గా ఉంటుంది. ARAI వాదన ప్రకారం వ్యాగన్ఆర్ CNG మోడల్ ఒక కిలో గ్యాస్‌లో 34 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది.

3. మెయింటనెన్స్‌ ఖర్చు తక్కువ

మారుతీ వ్యాగన్‌ ఆర్‌ కార్లకి మెయింటనెన్స్‌ ఖర్చు చాలా తక్కువ. అధిక విక్రయాల కారణంగా మీరు ఏ నగరం, పట్టణం, గ్రామంలో కూడా దాని భాగాలను సులువుగా కొనుగోలు చేయవచ్చు. దీని కోసం కార్ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు.

4. బెస్ట్‌ ఫీచర్లు

దేశంలోని అతి తక్కువ ధర కలిగిన కార్లలో వ్యాగన్ఆర్ ఒకటి. కానీ దాని అమ్మకాల దృష్ట్యా కంపెనీ విభిన్న మోడల్‌లలో అనేక ఫీచర్లను ఒక్కొక్కటిగా ఇచ్చింది. పవర్ విండోస్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ఆప్షన్‌లు తక్కువ ధరకే లభిస్తాయి. అందుకే ఇది తక్కువ ధరలో విలువైన కారు అని చెబుతారు.

5. డిజైన్‌లలో మార్పులు

మారుతున్న కస్టమర్ల అవసరాలు, కోరికల ప్రకారం మారుతి వ్యాగన్‌ ఆర్‌ కారుపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి మోడల్ నుంచి కొత్త డ్యూయల్ కవర్ టోన్ మోడల్ వరకు డిజైన్ చాలా సార్లు మార్చారు. యువత ఇష్టపడేలా అన్ని రంగులలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా డ్యూయల్ టోన్ కలర్‌లో కూడా వచ్చింది. ఈ మార్పులే కస్టమర్లను ఈ కారు వైపు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Health Tips: విటమిన్ బి-12 లోపిస్తే చాలా ప్రమాదం.. డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి..!

Bill Gates: కరోనా తర్వాత ఇప్పుడు మరో మహమ్మారి.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరిక..!