Mileage Bikes: ఇండియాలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఐదు బైక్‌లు ఇవే..!

Mileage Bikes: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి, వినియోగదారుల్లో ఒకటి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ బ్రాండ్‌లు ప్రపంచ వ్యాప్తంగా

Mileage Bikes: ఇండియాలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఐదు బైక్‌లు ఇవే..!
Mileage Bikes
Follow us
uppula Raju

|

Updated on: May 07, 2022 | 7:38 PM

Mileage Bikes: భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి, వినియోగదారుల్లో ఒకటి. బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ బ్రాండ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. ఇవి లగ్జరీ బైక్‌ల నుంచి తక్కువ ధర బైక్‌ల వరకు అన్నిటిని తయారుచేస్తున్నాయి. అయితే భారతీయులు తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని కోరుకుంటారు. అయితే చాలా ద్విచక్క వాహన కంపెనీలు ఇలాంటి బైక్‌లని తయారుచేస్తున్నాయి. ఇందులో అత్యంత ఫేమస్‌ అయిన ఐదు బైక్‌ల గురించి తెలుసుకుందాం. వీటి ధర దాదాపు రూ.50,000లకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది.

1. TVS స్పోర్ట్: TVS స్పోర్ట్ ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇది 7.8 హార్స్‌పవర్, 7.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 99.7cc ఇంజన్ కలిగి ఉంటుంది. 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, సస్పెన్షన్‌గా ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో కూడిన టెలిస్కోపిక్ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. ఇది 10 లీటర్ల పెట్రోల్‌ పట్టే ట్యాంకుని కలిగి ఉంటుంది. 108.5 కిలోల బరువు ఉంటుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర రూ. 41000.

2. బజాజ్ CT-100: బజాజ్ CT 100 అనేది ఎంట్రీ-లెవల్ బైక్‌. 50,000 కంటే తక్కువ ధర కేటగిరీలోని అత్యుత్తమ బైక్‌లలో ఇది ఒకటి. ఇది 102 cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది లీటర్‌కి 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బైక్ 8.2 హార్స్‌పవర్, 8 పౌండ్ అడుగుల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2017లో బజాజ్ ఆటో తన మోటార్‌సైకిళ్ల లైనప్‌కు CT100ని జోడించింది. ఈ బైక్ భారతదేశంలో అత్యంత సరసమైన బైక్‌ అని చెప్పవచ్చు.

3. బజాజ్ ప్లాటినా 100: బజాజ్ ప్లాటినా 100 అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ బైక్‌లలో ఒకటి. 2006లో తొలిసారిగా ఈ బైక్‌ను ప్రవేశపెట్టారు. కేవలం 8 నెలల్లోనే 5 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. కిక్-స్టార్ట్, ఎలక్ట్రిక్-స్టార్ట్. ఇటీవల దీనికి మరింత కంఫర్ట్ టెక్నాలజీ జోడించారు. ప్లాటినా 100 7.9 హార్స్‌పవర్, 8.34 టార్క్‌ను ఉత్పత్తి చేసే 102cc ఇంజన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 90 kmph గరిష్ట వేగంతో నాలుగు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసి ఉంటుంది. ఈ బైక్ 113 కిలోల బరువును, 13-లీటర్ ఇంధన ట్యాంక్‌తో పాటు 2-లీటర్ రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ భారతదేశంలో 50,000 లోపు ఉత్తమ మైలేజీ బైక్‌గా పరిగణిస్తారు.

4. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్: హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ అనేది ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్ గల సొగసైన బైక్. ఆకర్షణీయమైన బాడీ ఆర్ట్‌వర్క్‌తో తయారు చేశారు. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ టెయిల్ సెక్షన్‌లో పెద్ద గ్రాబ్ రైల్, సొగసైన టెయిల్ ల్యాంప్ ఉన్నాయి. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో ఫైవ్-స్పోక్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా ఉంటాయి.

5. హోండా డ్రీమ్ నియో: హోండా డ్రీమ్ నియో ధరలను సవరించింది. డ్రీమ్ నియో ప్రస్తుతం రూ.50,001కి అందుబాటులో ఉంది. ఈ బైక్ హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, టీవీఎస్ స్టార్ సిటీ, ఇతర ప్రసిద్ధ భారతీయ ప్రయాణికులకు బలమైన పోటీదారుగా ఉంటుంది. ఆల్ఫా రెడ్ మెటాలిక్, బ్లాక్ విత్ వైలెట్ స్ట్రిప్స్, పెర్ల్ అమేజింగ్ వైట్, బ్లాక్ విత్ రెడ్ స్ట్రైప్స్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్ కలర్‌లలో లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IGNOU Admit Card: బీఈడీ, బీఎస్పీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ కోసం అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!

Mahatama Gandhi: బ్రిటన్‌లో మహాత్మాగాంధీ వస్తువులు వేలం.. ఏ ఏ వస్తువులు వేలం వేస్తున్నారంటే..?

IPL 2022: గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన బట్లర్.. షాక్‌ అయిన గబ్బర్..!

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే