AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన బట్లర్.. షాక్‌ అయిన గబ్బర్..!

IPL 2022: ఐపీఎల్ 2022లో అద్భుత క్యాచ్‌లు నమోదయ్యాయి. ఇందులో కొన్ని క్యాచ్‌లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు జోస్ బట్లర్ క్యాచ్‌ కూడా అందులో చేరిపోయింది.

IPL 2022: గాల్లో ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన బట్లర్.. షాక్‌ అయిన గబ్బర్..!
Jos Buttler Super Catch
uppula Raju
|

Updated on: May 07, 2022 | 5:41 PM

Share

IPL 2022: ఐపీఎల్ 2022లో అద్భుత క్యాచ్‌లు నమోదయ్యాయి. ఇందులో కొన్ని క్యాచ్‌లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇప్పుడు జోస్ బట్లర్ క్యాచ్‌ కూడా అందులో చేరిపోయింది. అతడి అభిమానులు ఇప్పుడు వావ్‌ బట్లర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఈ రోజు రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్స్‌ కింగ్స్‌ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శిఖర్ ధావన్‌ ఇచ్చిన క్యాచ్‌ని బట్లర్‌ అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఈ క్యాచ్‌ చూసి పంజాబ్‌ అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. కుల్దీప్ స్థానంలో రవిచంద్రన్‌ ఆశ్విన్‌ బౌలింగ్‌కి దిగాడు. అతడి మొదటి ఓవర్‌లో రెండో బంతిని గబ్బర్‌ భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని జోస్‌ బట్లర్‌ అద్భుతంగా ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. బ్యాలెన్స్‌ ఆగకపోవడంతో కిందపడిపోతాడు. కానీ బంతిని మాత్రం విడిచిపెట్టడు. బట్లర్‌ ఈ క్యాచ్‌ పట్టిన తీరు అద్భుతం. ప్రస్తుతం ఈ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతోంది. ప్రేక్షకుల బట్లర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శిఖర్ ధావన్ 16 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు ఉన్నాయి. ధావన్ ఇలాంటి షాట్లు ఆడటం సహజమే. కానీ బట్లర్‌ ఆ క్యాచ్‌ పడతాడని ఎవరూ ఊహించలేదు. దీంతో పంజాబ్‌ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్‌లు జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ 47 పరుగులు జోడించిన తర్వాత గబ్బర్‌ ఔట్ అయ్యాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: గాలిలో గద్దల మధ్య పోటీ.. చేపని ఎలా క్యాచ్‌ పట్టిందో చూస్తే నోరెళ్లబెడుతారు..!

IPL 2022: మళ్లీ మిస్‌ అయింది.. పదోసారి టాస్‌ ఓడిపోయిన సంజూ శాంసన్..!..

Maruti Suzuki Wagonr: మారుతి వ్యాగన్‌ ఆర్‌ నెంబర్‌ వన్‌.. దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న కారు.. దీనికి కారణాలు ఏంటో తెలుసా..?