IPL 2022: ఆ స్టార్ ప్లేయర్‌కు పార్టీలు, గొడవలంటేనే ఇష్టం.. అందుకే జట్టు నుంచి తప్పించాం: వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
జట్టుకు అతను మాత్రమే అవసరం లేదని, మిగిలిన ఆటగాళ్లకు కూడా వారి స్వంత ప్రాముఖ్యత ఉందని అతనికి చూపించాలని అనుకున్నాం. అందుకే తగిన గుణపాఠాన్ని నేర్పించాం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గురువారం, వార్నర్ తన పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను టార్గెట్ చేసి మరీ బాదేశాడు. కేవలం 58 బంతుల్లో 92 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2022లో వార్నర్‌కి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఐపీఎల్ రెండో సీజన్ నుంచి డేవిడ్ వార్నర్ ఈ ఉత్కంఠభరితమైన టీ20 లీగ్‌లో భాగమయ్యాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున అరంగేట్రం చేశాడు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Also Read: IPL 2022: గుజరాత్ ఓటమిలో ఆ బౌలర్‌దే కీలక పాత్ర.. ప్లాన్ చేసి ఓడించిన రోహిత్ సేన.. ఆ ప్లేయర్ ఎవరంటే?
తాజాగా డేవిడ్ వార్నర్ గురించి సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వార్నర్ తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినప్పుడు, తన దృష్టి క్రీడల కంటే పార్టీలపైనే ఎక్కువగా ఉండేదంటూ సెహ్వాగ్ బాంబ్ పేల్చాడు. వార్నర్ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లతో గొడవ పడ్డాడని సెహ్వాగ్ తెలిపాడు. సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, ‘నేను చాలా మంది ఆటగాళ్లపై నా కోపాన్ని వెళ్లగక్కాను. అందులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. డేవిడ్ వార్నర్ జట్టులో కొత్తగా చేరినప్పుడు, ప్రాక్టీస్ చేయడం లేదా మ్యాచ్‌లు ఆడడం కంటే పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అతను మొదటి సంవత్సరంలోనే కొంతమంది ఆటగాళ్లతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత మేం వార్నర్‌ను రెండు మ్యాచ్‌ల నుంచి తొలగించాం’ అని పేర్కొన్నాడు.
సెహ్వాగ్ ఇంకా మాట్లాడుతూ, ‘కొన్నిసార్లు ఎవరికైనా గుణపాఠం చెప్పడానికి కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంటుంది. జట్టుకు అతను మాత్రమే అవసరం లేదని, మిగిలిన ఆటగాళ్లకు కూడా వారి స్వంత ప్రాముఖ్యత ఉందని అతనికి చూపించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇతర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ప్రదర్శన చేస్తుంటారు. జట్టు కోసం మ్యాచ్‌లను గెలవగలరు. అదే జరిగింది. వార్నర్‌ను జట్టుకు దూరంగా ఉంచి విజయం సాధించాం’ అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2022 వేలంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కూడా వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. వార్నర్ ఇంతకుముందు ఐపీఎల్ చివరి సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భాగంగా ఉన్నాడు. గతేడాది ఐపీఎల్ తొలి లెగ్‌లో పేలవమైన ప్రదర్శనతో వార్నర్ సన్‌రైజర్స్ కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్రాంచైజీ వార్నర్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేసింది. దీని తర్వాత, కేన్ విలియమ్సన్‌ను మేనేజ్‌మెంట్ జట్టు కెప్టెన్‌గా ఎంచుకుంది. వార్నర్ 2021 మినహా ప్రతి సీజన్‌లో సన్‌రైజర్స్ తరపున 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Watch Video: చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ.. హీరోగా మారిన విలన్.. ఆ రూ.2.60 కోట్ల బౌలర్ ఎవరంటే?