IPL 2022: మైదానంలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తోన్న చాహల్‌, బట్లర్‌.. పంజాబీ పాటకు ఎలా స్టెప్పులేశారో చూడండి..

ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (Jos Buttler ) మొత్తం 618 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అగ్రస్థానంలో ఉంటే.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ (Yuzvendra Chahal) 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.

IPL 2022: మైదానంలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తోన్న చాహల్‌, బట్లర్‌.. పంజాబీ పాటకు ఎలా స్టెప్పులేశారో చూడండి..
Chahal And Buttler
Follow us
Basha Shek

|

Updated on: May 07, 2022 | 6:12 PM

Rajasthan Royals: ఐపీఎల్-2022 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ మంచి జోష్‌లో ఉంది. ఇప్పటివరకు10 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక ఆ జట్టు ఆటగాళ్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (Jos Buttler ) మొత్తం 618 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అగ్రస్థానంలో ఉంటే.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ (Yuzvendra Chahal) 22 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు. కాగా చాహల్ సతీమణి ధనశ్రీవర్మ (Dhanashree Verma) భర్త ఆడే మ్యాచ్‌లకు హాజరవుతూ స్టేడియంలో సందడిచేస్తోంది. అలాగే రాజస్థాన్‌ ఆటగాళ్లతో సరదాగా కలిసిపోతూ వారితో దిగిన ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఈక్రమంలో ధనశ్రీ షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో బట్లర్‌, చాహల్ లు సరదాగా స్టెప్పులేశారు. ‘డ్యాన్సింగ్ టు బల్లే ని బల్లే’ పాటకు ఇద్దరూ ఇరగదీశారు. బట్లర్‌ స్లో మూమెంట్స్‌తో ఆకట్టుకోగా.. చాహల్‌ మాత్రం​మాస్‌ స్టెప్పులేసి మెప్పించాడు.

యూట్యూబ్‌లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన ధనశ్రీ వర్మనే ఈ పాటకు కూడా కొరియాగ్రాఫర్‌గా వ్యవహరించడం విశేషం. కాగా ఈ వీడియోను రాజస్థాన్‌ జట్టు తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా షేర్‌ చేసుకుంది. దీనికి ధనశ్రీ వర్మ ‘నా మోస్ట్ ఫేవరెట్ రీల్.. మై ఫేవరెట్స్… లవ్’ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. కాగా నేటి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడుతోంది రాజస్థాన్‌. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌ రేసులో మరింత ముందుకు వెళుతుంది శామ్సన్‌ సేన.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

PBKS vs RR Live Score: అర్ధసెంచరీతో రాణించిన బెయిర్‌ స్టో.. చివర్లో జితేశ్‌ మెరుపులు.. రాజస్థాన్‌ టార్గెట్‌ ఎంతంటే..

CM Stalin: ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న స్టాలిన్‌.. మరో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..

Watch Video: చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ.. హీరోగా మారిన విలన్.. ఆ రూ.2.60 కోట్ల బౌలర్ ఎవరంటే?