CM Stalin: ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న స్టాలిన్.. మరో ఐదు కొత్త పథకాలకు శ్రీకారం..
డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా సీఎం స్టాలిన్ బస్సులో ప్రయాణించారు. తన ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
Tamil Nadu CM Stalin: అధికారం చేపట్టినప్పటినుంచి వినూత్న పథకాలు, నిర్ణయాలతో పాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ( CM Stalin). తాజాగా డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా స్టాలిన్ బస్సులో ప్రయాణించారు. తన ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరీనాబీచ్ సమీపంలోని తన తండ్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై సమాధుల వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి శాసనసభలో ఐదు కీలక ప్రకటనలు చేశారు.
వారికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ ..
ఈ సందర్భంగా ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని స్టాలిన్ ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వమే ఉదయం టిఫిన్ అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యా వసతులు మెరుగుపర్చడమే లక్ష్యంగా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, పాఠశాల విద్యార్థులకు మెడికల్ చెకప్, పట్టణాల తరహాలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, ‘మీ నియోజకవర్గంలో సీఎం’ అనే పథకాలను ప్రారంభిస్తున్నట్టు తమిళనాడు సీఎం తెలిపారు. అంతకుముందు కూడా ఐదేళ్లలోపు చిన్నారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది తమిళనాడు సర్కార్. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు నడిపే అన్ని రకాల బస్సుల్లో వారికి ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. కాగా 234 మంది అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో సొంతంగా 133 సీట్లు గెలుచుకుని గత ఏడాది ఇదే రోజు (మే 7న) అధికారంలోకి వచ్చింది స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ. దాదాపు పదేళ్ల తర్వాత ఈ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే ఘన విజయం సాధించింది.
கழக அரசு பொறுப்பேற்ற முதலாமாண்டு முத்தான தொடக்கமாக அமைந்துள்ளது. இரண்டாம் ஆண்டு நிச்சயம் இணையற்ற ஆண்டாக இருக்கும்!
வாருங்கள் நாம் அனைவரும் இணைந்து #DravidianModel-ல் நமக்கான தமிழ்நாட்டை அமைப்போம்!
எந்நாளும் உழைப்பேன்! தமிழ்நாட்டைக் காப்பேன்!#1YearOfCMStalin pic.twitter.com/JcFheSG730
— M.K.Stalin (@mkstalin) May 7, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: