Sarkaru Vaari Paata: నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..

ట్రైలర్‏లో మహేష్ చెప్పిన నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Sarkaru Vaari Paata: నేను విన్నాను.. నేను ఉన్నాను డైలాగ్ పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..
Parasuram
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 7:00 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించగా..  (Sarkaru Vaari Paata)ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటించింది. సర్కారు వారి పాట మూవీపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొన్న ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. దర్శకుడు పరశురాం పలు ఇంటర్వ్యూలలో పాల్గోంటూ సర్కారు వారి పాట గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

సర్కారు వారి పాట ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇందులో మహేష్ హ్యాండ్సమ్ లుక్.. కీర్తి సురేష్ గార్జియస్ లుక్.. డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‏లో మహేష్ చెప్పిన నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ మాటను గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అంటుండేవారు.. తాజాగా ఈ మాటను సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబు చెప్పడంతో నెట్టింట్లో ట్రెండ్ అయ్యింది. తాజాగా ఈ డైలాగ్‏ను సర్కారు వారి పాట సినిమాలో పెట్టడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు డైరెక్టర్ పరశురామ్.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి

‘నేను విన్నాను.. నేను వున్నాను’ డైలాగ్ పెట్టారు.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణా ? అని విలేకరి అడగ్గా.. నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాల గొప్ప మాటని సింపుల్ గా చెప్పేశారు. సర్కారు వారి పాట లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది. ఆ సీన్ అద్భుతంగా వుంటుంది అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ పరశురామ్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..

Sarkaru Vaari Paata: సినిమాలో మహేశ్‌ను చూస్తే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవాల్సిందే.. పరుశురామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి