AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha ) స్పీడ్ పెంచింది. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు వరుస

Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..
Samantha
Rajitha Chanti
|

Updated on: May 06, 2022 | 4:15 PM

Share

అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత (Samantha ) స్పీడ్ పెంచింది. ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలలో సమంత దూకుడు పెంచింది. ఇప్పటికే శాకుంతలం సినిమా కంప్లీట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం యశోద సినిమాలో నటిస్తుంది. మే 5న విడుదలైన యశోద ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫీమేల్ ఓరియంటెడ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాతో హరి.. హారీష్ దర్శకులుగా పరిచయం కాబోతుండగా.. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు మాజీ భర్త నాగచైతన్యకు.. సమంత బాక్సాఫీస్ వద్ద వార్ జరగబోతుంది. అదేలాగా అనుకుంటున్నారా ?…

అసలు విషయానికి వస్తే అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరిద్దరు ఆకస్మాత్తుగా విడాకుల ప్రకటన చేయడంతో సామ్.. చై అభిమానులు షాక్ అయ్యారు. వీరి విడాకులకు కారణం మాత్రం ఇంకా తెలియలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సామ్ ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఒక్కరోజు ముందుగా అంటే ఆగస్ట్ 11న నాగచైతన్య, ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదల కాబోతుంది. ఇవే కాకుండా.. యశోద సినిమా విడుదల రోజునే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద సామ్, చైతూ, అఖిల్ సినిమాలు రిలీజ్ కాబోతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:Eesha Rebba: అందం అభినయం కలబోత ఈ కుర్రది.. నిషా కళ్ళ ఈషా సోయగం పోగడతరమా

Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న’సర్కారు వారి పాట’

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..