Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej)నటిస్తున్న మూడో సినిమా రంగ రంగ వైభవంగా((Ranga Ranga Vaibavanga)అనే మూవీ రాబోతున్న విషయం తెలిసిందే

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..
Ranga Ranga Vaibhavanga
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2022 | 12:27 PM

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej)నటిస్తున్న మూడో సినిమా రంగ రంగ వైభవంగా(Ranga Ranga Vaibavanga)అనే మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వైష్ణ‌వ్ తేజ్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఆ తర్వాత కొండాపొలం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.ఇప్పుడు రంగ రంగ వైభవంగా  సినిమాతో రాబోతున్నాడు.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి రంగ రంగ వైభవంగా సినిమాను జూలై 1 భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈక్రమంలో రంగ రంగ వైభవంగా నుంచి మరో అందమైన మెలోడీని రిలీజ్ చేశారు. అర్మాన్ మాలిక్ , హరిప్రియ ఆలపించిన ఈ పాటను..శ్రీమణి సాహిత్యం అందించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తుందని పాటలు వింటుంటే అర్ధమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..