Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..

బుల్లితెర యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల (Suma Kanakala). కొన్నేళ్లుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంటూ టాప్ యాంకర్‎గా

Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..
Suma Kanakala
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2022 | 3:47 PM

బుల్లితెర యాంకర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ కనకాల (Suma Kanakala). కొన్నేళ్లుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకుల మనసులు దొచుకుంటూ టాప్ యాంకర్‎గా దూసుకుపోతుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా.. టీవీ షోస్ అయిన సుమ కచ్చితంగా ఉండాల్సిందే. పంచులు, ప్రాసలతో ఆడియన్స్‏ను నవ్విస్తూ వినోదాన్ని అందించడంలో సుమ స్టైలే వేరు.. అంతేకాకుండా.. చిన్న సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ప్రతి మూవీ మేకర్స్‏ను సుమ ఇంటర్వ్యూ చేసేస్తుంది. కెరీర్ ప్రారంభంలో నటిగా ఉన్నా సుమ… ఆ తర్వాత యాంకర్‏గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ టీవీ షోస్, ఈవెంట్స్ అంటూ బిజీ షెడ్యూల్ గడిపే సుమ కనకాల.. చాలా కాలంగా వెండితెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడు సుమ కనకాల జయమ్మ పంచాయతీ సినిమాతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ మూవీ మే 6న విడుదలైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సుమ కనకాల ఇక యాంకరింగ్‏కు ఫుల్ స్టాప్ పెట్టనుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు..

ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్స్‎లో భాగంగా ఇదే ప్రశ్న ఎదురైంది.. ఇక సినిమాల్లో బిజీ అవుతున్నారు.. యాంకరింగ్‏కు ఫుల్ స్టాప్ పెడతారా ? అంటూ విలేకరి అడగ్గా.. అయ్యయ్యో అలాంటిదేమి లేదు.. నన్ను ఇక్కడి వరకు నిలబెట్టింది యాంకరింగే.. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను సినిమా చేసినా యాంకర్ గా కొనసాగుతాను. బుల్లితెర నాకు అన్నం పెట్టింది. దాన్ని ఎలా వదులుకుంటా అంటూ చెప్పుకొచ్చింది సుమ కనకాల. దీంతో సుమ యాంకరింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతుందా ? అనే సందేహలను తెలిగ్గా కొట్టిపడేసింది సుమ కనకాల. జయమ్మ పంచాయతీ సినిమాకు ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:Eesha Rebba: అందం అభినయం కలబోత ఈ కుర్రది.. నిషా కళ్ళ ఈషా సోయగం పోగడతరమా

Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న’సర్కారు వారి పాట’

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..