AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. సర్కారు వారి పాట ట్విట్టర్ ఎమోజీ అదుర్స్..

మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్‏ప్రైజ్.. సర్కారు వారి పాట ట్విట్టర్ ఎమోజీ అదుర్స్..
Sarkaru Vaari Paata
Rajitha Chanti
|

Updated on: May 05, 2022 | 4:16 PM

Share

మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)  సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు .. కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో మహేష్ బాబు మరింత హ్యాండ్సమ్ లుక్ లో కనిపింనుండడంతో సర్కారు వారి పాట చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్సీ సాంగ్స్ యూట్యూబ్‏లో మిలియన్ వ్యూస్‏తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 12న ఘనంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా మహేష్ ఫ్యాన్స్‏కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది చిత్రయూనిట్.

నిన్న అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్‌ ను వెల్లడిస్తానని ప్రకటించి చిత్ర యూనిట్, చెప్పినట్లే ‘సర్కారు వారి సూపర్ సర్ప్రైజ్’ అందించింది. సర్కారు వారి పాట ట్విట్టర్ ఎమోజీతో అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. ట్విట్టర్‏లో ఒక రీజినల్ మూవీ ప్రత్యేకమైన ఎమోజీని కలిగి ఉండటం ఇదే తొలిసారి. ఇంతకుముందు కెజిఎఫ్ 2, సాహో వంటి పాన్ ఇండియన్, మల్టీ లాంగ్వేజ్ చిత్రాలకు మాత్రమే ఎమోజి ఉండేది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, సర్కారు వారి పాట సినిమాపై వున్న భారీ హైప్ నేపధ్యంలో ట్విట్టర్ టీమ్ ఎమోజిని యాక్టివేట్ చేసింది. సినిమా టైటిల్ హ్యాష్‌ట్యాగ్‌ లతో సర్కారు వారి ఎమోజి ని వాడటం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులని అలరిస్తుంది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ సాంగ్స్ , ట్రైలర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాయి. ఇప్పుడు ఈ ట్విట్టర్ ఎమోజీ టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ ను సెట్ చేసింది సర్కారు వారి పాట.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరగనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. మే 7న సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఫ్యాన్స్ భారీగా వచ్చి ఈవెంట్ ని ప్రత్యేక్షంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్ర యూనిట్ ఓపెన్ గ్రౌండ్‌ను ఎంచుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..