Darshan: అతడిని దారుణంగా కొట్టి సిగరెట్లతో కాల్చారు.. రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు..
అభిమానిని దారుణంగా చంపిన కేసులో కటకటాలు లెక్కపెడుతున్నాడు కన్నడ హీరో దర్శన్. కేవలం తన ప్రియురాలికి అసభ్యకరంగా సందేశాలు పంపించాడన్న కోపంతో బాధితుడిని కిడ్నాప్ చేసి నరకం చూపించి చంపేశారు. ఈ కేసులో దర్శన్ తోపాటు అతడి ప్రియురాలు పవిత్ర గౌడను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఈ కేసులో 14వ నిందితుడైన ప్రదోష్ రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు.

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ హీరో దర్శన్ స్నేహితుడు రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రదోష్, తనను క్షమాభిక్ష సాక్షిగా పరిగణించాలని కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేశాడు. ఈ కేసులో 14వ నిందితుడైన ప్రదోష్, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుతో పంచుకుంటానని.. అందుకు తన క్షమాభిక్షను పరిగణించాలని దరఖాస్తు చేసుకున్నాు. ప్రదోష్ దాఖలు చేసిన దరఖాస్తులో కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోజు జరిగిన ఘటన నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతి అంశాన్నీ అతడు పిటిషన్ లో పేర్కొన్నారు. పవిత్ర గౌడకు సందేశాలు పంపించాడని దర్శన్ రేణుకాస్వామిని నిలదీశాడని.. ఆ సమయంలో అతడిని దారుణంగా కొట్టడంతో అతడి తల నుంచి రక్తం రావడం తాను చూశానని అన్నారు.
అంతేకాకుండా అతడిని కిడ్నాప్ చేసి బంధించిన ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిచి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారని.. ఆ తర్వాత అతడిపై విచక్షరణ రహితంగా దాడి చేసి లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్ కు వేలాడదీసి నైలాన్ తాడుతో కొట్టారని ప్రదోష్ తెలిపారు. అంతలా కొడితే అతడు చనిపోతాడని తాను చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోలేదని.. అతడికి ఆహారం, నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారని.. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. వెంటనే దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించాడని.. తాను జోక్యం చేసుకుని అతడిని పక్కకు లాగానని తెలిపారు. అయితే రేణుకాస్వామి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని సద్ధుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ తను బెదిరించారని.. దీంతో అసలు విషయం చెప్పకుండా కల్పిత కథ చెప్పేందుకు చర్చలు జరిగాయని వెల్లడించారు.
కేసులో సహకరించకపోతే కాల్చి చంపుతానని దర్శన్ బెదిరించడంతో, తాను దర్శన్‌కు సహాయం చేశానని ప్రదోష్ తన దరఖాస్తులో పేర్కొన్నాడు. రేణుకాస్వామిపై దాడి జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. రేణుకాస్వామిపై దాడిని నివారించడానికి నేను చాలా గట్టిగా ప్రయత్నించాను. రేణుకాస్వామిపై దారుణంగా దాడి చేసి, సిగరెట్లతో కాల్చారు అని తెలిపారు. అంతేకాకుండా, ఈ కేసు ఎలా జరిగింది? ఈ కేసులో ఎవరెవరు పాలుపంచుకున్నారనే వివరాలన్నీ తనకు తెలుసని, తనను క్షమాభిక్ష సాక్షిగా పరిగణిస్తే, కోర్టు ముందు అన్నీ చెబుతానని ప్రదోష్ తెలిపాడు. ప్రదోష్, దర్శన్‌కు ఆప్తమిత్రుడు , ఆర్ఆర్ నగర్‌లోని స్టోనీ బ్రూక్ బార్ అండ్ రెస్టారెంట్‌కు యజమాని.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..
