AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్

రొట్టె విరిగి నేతిలో పడింది! ప్రేమ పెరిగి పెళ్లితో ఆగింది! వయసు పెరిగి మనసునెరిగింది!! ఇప్పుడివన్నీ అర్జున్ కపూర్, మలైకా అన్యోన్య ప్రేమను చూడగానే తన్నుకొస్తున్న పదాల అల్లికలు

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్
Arjun Kapoor Malaika
Rajeev Rayala
|

Updated on: May 06, 2022 | 1:19 PM

Share

రొట్టె విరిగి నేతిలో పడింది! ప్రేమ పెరిగి పెళ్లి అయ్యింది! వయసు పెరిగి మనసునెరిగింది!! ఇప్పుడివన్నీ అర్జున్ కపూర్(Arjun Kapoor), మలైకా( Malaika Arora)అన్యోన్య ప్రేమను చూడగానే తన్నుకొస్తున్న పదాల అల్లికలు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నయా సామెతలు. లేటు వయసులో తన కన్నా చిన్న వాడైన కుర్ర హీరోతో మలైకా సాగించిన ఘాటు ప్రేమ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సెషన్.  అయితే ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి అతడినే పెళ్లి చేసుకుంటూ ఉండడం మరో సెన్సేషన్. అర్జున్ కపూర్ తో ఈఅమ్మడు చట్టపట్టాలేసుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు చాలా క్లోజ్ గా కనిపిస్తూ మీడియా కు కావాల్సినంత న్యూస్ ఇస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి టాపిక్ వైరల్ అవుతుంది.

సల్మాన్ ఖాన్ బ్రదర్ సోహైల్ ఖాన్ ను ప్రేమ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైన మలైకా… ఆ తరువాత ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతూ… సల్మాన్ ఖాన్‌ను ప్రియ శిష్యునిగా పేరు తెచ్చుకున్న అర్జున్ కపూర్ తో ప్రేమలో పడింది. పడీ పడగానే భర్త సోమైల్ ఖాన్ కు  విడాకులిచ్చేసి..మరో ఇంటికి షిఫ్ట్ అయింది. చట్టా పట్టాలేసుకుని ఇన్నాళ్లు ఆ హీరోతో తిరిగింది. ఇక ఇప్పుడు ముదిరిన ప్రేమతో… పెళ్లి కి సిద్దమైందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. త్వరలో గ్రాండ్‌గా అతనితో ఏడడుగులు వేయబోతోందని ఫిల్మీ సర్కిల్లో గాసిప్ వైరల్ అవుతోంది. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..