AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virata Parvam: విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న రానా, సాయి పల్లవి పోస్టర్..

ఎట్టకేలకు విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. దగ్గుబాటి రానా.. సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

Virata Parvam: విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న రానా, సాయి పల్లవి పోస్టర్..
Virata Parvam
Rajitha Chanti
|

Updated on: May 06, 2022 | 5:57 PM

Share

ఎట్టకేలకు విరాట పర్వం రిలీజ్ డేట్ వచ్చేసింది. దగ్గుబాటి రానా.. సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అసలైన సమయం కుదరలేదనే చెప్పుకోవాలి. సినిమా చిత్రీకరణ పూర్తైన నెలలు గడుస్తు్న్నా.. చిన్న అప్డేట్ కూడా లేకపోవడంతో విరాట పర్వం సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..తాజాగా మే 6న సాయంత్రం విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినీ ప్రియులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న విరాటపర్వం సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

రిలీజ్ డేట్‏తోపాటు షేర్ చేసిన సరికొత్త పోస్టర్లో రానా, సాయి పల్లవి ఇద్దరు అరణ్యంలో చేతులు పట్టుకుని పరిగెత్తుతున్నట్లు కనిపిస్తోంది. చేతిలో తుపాకీతో రానా దూకుడుగా కనిపిస్తుండగా.. సాయి పల్లవి భయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయగా.. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రానా.. కామ్రేడ్ రావన్న పాత్రలో నటిస్తుండగా.. అతడి కవితలు చదివి అతడి ప్రేమ కోసం వెళ్లే యువతి వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించగా.. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నీరు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..

Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..