AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.. ఉపాసనకు రామ్ చరణ్ స్వీట్ మెసేజ్..

టాలీవుడ్ లవబుల్ పెయిర్స్‏లో రామ్ చరణ్ (Ram Charan ), ఉపాసన  (Upasana)జంట ఒకటి. వీరిద్దరు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.

Ram Charan: మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.. ఉపాసనకు రామ్ చరణ్ స్వీట్ మెసేజ్..
Ram Charan Upasana
Rajitha Chanti
|

Updated on: May 06, 2022 | 5:13 PM

Share

టాలీవుడ్ లవబుల్ పెయిర్స్‏లో రామ్ చరణ్ (Ram Charan ), ఉపాసన  (Upasana)జంట ఒకటి. వీరిద్దరు ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. కాలేజీ రోజుల్లో ప్రేమికులుగా ఉన్న వీరు.. పెద్దల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఓ వైపు వరుస సినిమా షూటింగ్స్‏తో చరణ్ బిజీగా ఉన్నప్పటికీ కాస్త విరామం దొరికితే చాలు సతీమణితో కలిసి వెకెషన్స్‏కు వెళ్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా వలన దాదాపు మూడు సంవత్సరాలు చరణ్ ఉపాసన వెకెషన్స్ దూరంగా ఉన్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు వీరిద్దరు కలిసి ఫిన్లాండ్ లో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చెర్రీ వరుస సినిమాలతో బీజాగ గడిపేస్తున్నారు. ఇటీవల ఆచార్య సినిమా ప్రమోషన్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపిన చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 మూవీ షూటింగ్‏లో పాల్గోంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్.. తన సతీమణి ఉపాసనకు ఇన్‏స్టా వేదికగా స్వీట్ మేసేజ్ చేశాడు..

ఇటీవల ఉపాసన కొణిదెల తన పాత వెకేషన్ ఫోటోను షేర్ చేస్తూ.. హాలీడేకు వెళ్లడానికి ఇంకాస్త వేచి ఉండాలని.. ప్రస్తుతానికి ఇంత వేడిలో వర్క్ చేయడం కష్టంగా ఉందంటూ పోస్ట్ చేశారు.. ఆమె పోస్ట్ కు చరణ్ స్పందిస్తూ.. నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది.. కాకపోతే ఆర్సీ 15 షూట్ విశాఖలో జరుగుతున్న కారణంగా మనం ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే అంటూ పాత వెకేషన్ ఫోటోస్ షేర్ చేశారు చరణ్.. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో చరణ్.. ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తిచేసిన చిత్రయూనిట్… ఇప్పుడు విశాఖపట్నంలో మరో షెడ్యూల్ జరుపుకుంటుంది. సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..

Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..