AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Sharma: త్వరలోనే ఏకం కానున్న ప్రేమ పక్షులు.. టెన్నిస్‌ స్టార్‌తో పెళ్లి పీటలెక్కనున్న ఖడ్గం హీరోయిన్‌!

మొదట యువరాజ్‌సింగ్‌ (YuvarajSingh) తో కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన కిమ్ శర్మ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానీని వివాహం చేసుకుంది. అయితే వైవాహిక బంధంలో ఇమడలేక కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది.

Kim Sharma: త్వరలోనే ఏకం కానున్న ప్రేమ పక్షులు.. టెన్నిస్‌ స్టార్‌తో పెళ్లి పీటలెక్కనున్న ఖడ్గం హీరోయిన్‌!
Kimsharma
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: May 07, 2022 | 7:01 PM

Share

‘ముసుగు వేయొద్దు మనసు మీద’ అంటూ ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది కిమ్‌ శర్మ (Kim Sharma). ఆతర్వాత మగధీర సినిమాలో ఏం పిల్లడో అంటూ టాలీవుడ్‌ సినీ ఫ్యాన్స్‌కు మరింత చేరువైంది. అంతకుముందు బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే ఈమె సినిమాల కంటే తన లవ్‌ ఎఫైర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట యువరాజ్‌సింగ్‌ (YuvarajSingh) తో కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన ఆమె 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అలీ పుంజానీని వివాహం చేసుకుంది. అయితే వైవాహిక బంధంలో ఇమడలేక కొన్ని రోజులకే విడాకులు తీసుకుంది. అనంతరం టాలీవుడ్‌ నటుడు హర్షవర్ధన్‌ రాణేతో ప్రేమలో పడింది. అయితే కొన్ని రోజులకే ఈ బంధం కూడా బీటలు వారింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ (Leander Paes)తో లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉంది.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి

పెద్దల ఆశీర్వాదంతో.. ఇక పేస్‌ కూడా గతంలో బాలీవుడ్‌ బ్యూటీ మహిమా చౌదరితో డేటింగ్‌ చేశాడు. ఆతర్వాత ఆమెతో విడిపోయి సంజయ్‌ దత్‌ మాజీ భార్య రియాపిళ్లైను వివాహం చేసుకున్నాడు. అయితే మనస్పర్థలు వచ్చి కొద్దిరోజులకే విడిపోయారు. ఒకానొక సందర్భంలో పేస్‌ తనను వేధించాడని కోర్టుకెళ్లింది రియా. ఈక్రమంలో కిమ్‌శర్మతో గత కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు ఈ టెన్నిస్‌ లెజెండ్‌. ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు. వెకేషన్లు, పార్టీలలో జోడీగానే దర్శనమిస్తున్నారు. వీరు కలిసున్న ఫొటోలు కూడా నెట్టింట్లో బాగా వైరలయ్యాయి. తాజాగా ఈ ప్రేమ పక్షులు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారట. వీరి పెళ్లికి ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించిందని త్వరలోనే కోర్టు మ్యారేజ్‌ ద్వారా ఏకం కానున్నారని సమాచారం. వీరి పెళ్లి కోసం కిమ్‌ శర్మ, పేస్‌ల తల్లిదండ్రులు కూడా ఇటీవలె ముంబైకి చేరుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే తమ పెళ్లి గురించి కిమ్‌-పేస్‌లు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Health Tips: పరగడుపున ఉసిరి జామ్‌ తింటే బోలెడు ప్రయోజనాలు.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..

Cyclone Asani: వాయు వేగంతో దూసుకొస్తున్న ‘అసాని’ తుపాన్.. తీరప్రాంతాల్లో అలర్ట్..