Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..

ఇప్పటికే సర్కారు వారి పాట హడావిడి మొదలైంది. ఈ క్రమంలో మహేష్ తన ఫ్యాన్స్‏కు ప్రత్యేకమైన కరపత్రాన్ని పోస్ట్ చేశారు.

Mahesh Babu: ఫ్యాన్స్‏కు మహేష్ బాబు స్పెషల్ లెటర్.. ఒకేసారి డబుల్ ట్రీట్ ..
Mahesh Babu 1
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2022 | 7:01 PM

సూపర్ స్టార్ మహేష్ మేనియా మొదలైంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా మే 12న గ్రాండ్‏గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఈరోజు (మే7న) హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‏లో సాయంత్రం 6 గంటలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట హడావిడి మొదలైంది. ఈ క్రమంలో మహేష్ తన ఫ్యాన్స్‏కు ప్రత్యేకమైన కరపత్రాన్ని పోస్ట్ చేశారు. ఎప్పుడూ ట్విట్వర్‌లోనో, అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లోనో మాత్రమే కనిపించే సూపర్‌స్టార్ మహేష్‌బాబు… సోషల్ మీడియాలోనే కొత్త రకం రూట్ కనిపెట్టారు. తన పేరున్న లెటర్ హెడ్‌ మీద, పద్మాలయా చిరునామాపై పాంప్లేట్ తరహా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి… అప్‌డేట్స్ ఇవ్వడంలో బ్రాండ్‌ న్యూ ఎక్స్‌పరిమెంట్ షురూ చేశారు.

ఘట్టమనేని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ మొత్తం సర్కారువారి పాట మేనియాలో మునిగి తేలుతుంటే.. సైలెంట్‌గా షార్ట్‌కట్‌లో తన సినిమా డీటెయిల్స్ రివీల్ చేశారు మహేష్‌బాబు. సర్కారువారి పాట షూటింగ్ పూర్తయి ఈనెల 12న రిలీజ్‌కి రెడీ అవుతోందని, ఆ సినిమా పాటల్ని సరేగమలో విని ఎంజాయ్ చేయండి అని ఫ్యాన్స్‌కి పిలుపునిస్తూ ఒక కరపత్రం ప్రెస్‌లో రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా అంటూ తన నెక్స్ట్ మూవీ అప్‌డేట్‌ని కూడా ఇచ్చేశారు మహేష్‌బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తాను నటించబోయే హ్యాట్రిక్ మూవీ షూటింగ్‌ రెగ్యులర్ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ ఇచ్చారు. చెప్పిన విషయంలో కొత్తదనం లేకపోయినా… ఆ విషయాన్ని చెప్పిన విధానం కొత్తగా వుంది. కొద్దిగా వింటేజ్ ఫీల్‌ కూడా కలిగిస్తోంది.

Mahesh

Mahesh

బైలైన్.. శ్రీహరి… (టీవీ 9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..

Sarkaru Vaari Paata: సినిమాలో మహేశ్‌ను చూస్తే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవాల్సిందే.. పరుశురామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..