AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: మళ్లీ నాజుగ్గా మారిన చందమామ.. డెలివరీ తర్వాత తొలి ఫోటో షేర్ చేసిన కాజల్..

డెలివరీ అనంతంరం కాజల్ తొలిసారిగా తన ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ మరింత నాజుగ్గా మారి..

Kajal Aggarwal: మళ్లీ నాజుగ్గా మారిన చందమామ.. డెలివరీ తర్వాత తొలి ఫోటో షేర్ చేసిన కాజల్..
Kajal
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: May 07, 2022 | 7:01 PM

Share

టాలీవుడ్ బ్యూటీఫుల్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాను తల్లిగా ప్రతి క్షణాన్ని ఆనందిస్తున్నట్లుగా ఇటీవల ట్వీట్ చేసింది. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో కాజల్ ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేయగా.. కాజల్ లుక్ పై ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. తాజాగా డెలివరీ అనంతంరం కాజల్ తొలిసారిగా తన ఫోటోను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ మరింత నాజుగ్గా మారి.. గ్లామరస్‏గా మునుపటి హీరోయిన్‏గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాజల్ లేటేస్ట్ ఫోటో చూసిన నెటిజన్స్ బ్యూటీఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి

ఇటీవల తన బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన బిడ్డ నీల్ కిచ్లును ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. తల్లిగా తనకు చాలా ఆనందంగా ఉందని.. తన బిడ్డను హత్తుకున్నప్పుడు తన కష్టం పూర్తిగా మర్చిపోయినట్లుగా చెప్పుకొచ్చింది కాజల్. ఇకపై ఈ అమ్మడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి..తన బిడ్డ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తన లేటేస్ట్ ఫోట్ షేర్ చేయడంతో తిరిగి సినిమాల్లోకి రాబోతుందా ? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కాజల్ చివరిసారిగా ఆచార్య సినిమాలో నటించగా.. స్క్రీప్ట్ ప్రకారం ఆమె పాత్రను తొలగించినట్లు చెప్పుకొచ్చారు డైరెక్టర్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’కు ఏపీ సర్కారు గుడ్‌ న్యూస్‌.. టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ..

Sarkaru Vaari Paata: సినిమాలో మహేశ్‌ను చూస్తే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవాల్సిందే.. పరుశురామ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Nayanthara-Vignesh: నయన్ విగ్నేష్‌ల పెళ్లి డేట్ ఫిక్స్?.. తిరుమలలో పెళ్లి పీటలు ఎక్కనున్న జంట..