AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..

Sundeep Kishan: ప్రస్థానంతో చిత్రంలో టాలీవుడ్‌కు దొరికిన యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌. తొలి చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో నటించి మెప్పించాడు. అనంతరం వరుసగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి నటుడిగా దూసుకుపోతున్న సందీప్‌ తాజాగా...

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ పాన్‌ ఇండియా మూవీ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. పోస్టర్‌ మాములుగా లేదుగా..
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: May 07, 2022 | 7:01 PM

Share

Sundeep Kishan: ప్రస్థానంతో చిత్రంలో టాలీవుడ్‌కు దొరికిన యంగ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సందీప్‌ కిషన్‌. తొలి చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో నటించి మెప్పించాడు. అనంతరం వరుసగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మంచి నటుడిగా దూసుకుపోతున్న సందీప్‌ తాజాగా పాన్‌ ఇండియా చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు. మైఖేల్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌తో పాటు విజయ్‌ సేతుపతి కూడా నటుస్తున్నాడు. దీంతో ఈ సినిమాను అనౌన్స్‌ చేసిన నాటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

సర్కారు వారి పాట మరిన్ని అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..  

ఇదిలా ఉంటే నేడు (శనివారం) సందీప్‌ కిషన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ‘మైఖేల్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. విజయ్‌ సేతుపతి స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు.. ‘నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు రంజిత్ దర్శకత్వం వహిస్తున్న మైఖేల్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చిన విజయ్‌.. సందీప్‌ కిషన్‌కు బర్త్‌డే విషెస్‌ కూడా తెలిపారు.

ఇక ఈ ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. అసలు సినిమా కాన్సెప్ట్ ఎంటన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించింది. సిక్స్‌ప్యాక్‌ బాడీలో చేతిలో గన్‌తో డిఫ్రెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు సందీప్‌. కొందరు తన చుట్టూ తుపాకులు, కత్తులు పట్టుకొని దాడి చేయడానికి వస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి తొలిసారి పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సందీప్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్…..

Indore Fire Accident: రెండంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళతో సహా ఏడుగురు సజీవ దహనం Social Media: వామ్మో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ రీల్స్ చేసి ఇంత సంపాదిస్తారా..! దిమ్మతిరిగిపోతుందిగా..