Indore Fire Accident: రెండంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళతో సహా ఏడుగురు సజీవ దహనం

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండగా మంటలు ఎగసిపడ్డాయి.

Indore Fire Accident: రెండంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళతో సహా ఏడుగురు సజీవ దహనం
Fire Accident
Follow us
Balaraju Goud

|

Updated on: May 07, 2022 | 12:44 PM

Indore Fire Accident: మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటల్లో చిక్కుకొని ఏడుగురు సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి అక్కడున్న వాహనాలు కూడా పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగాయని ప్రాథమిక నిర్థారణకొచ్చారు పోలీసులు. సమాచారమందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపుచేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏడుగురు సజీవదహనమయ్యారు.

ఇండోర్‌లో శుక్రవారం అర్థరాత్రి మూడు గంటల సమయంలో పెను ప్రమాదం జరిగింది. ఇక్కడి విజయ్ నగర్ ప్రాంతంలోని స్వర్న్ బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ హృదయ విదారక ఘటనలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు విజయ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. షార్ట్‌సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 3 గంటల సమయం పట్టిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

అగ్ని ప్రమాదానికి గురైన ఈ భవనం ఇషాక్ పటేల్ ఇల్లు అని చెబుతున్నారు. అదే సమయంలో చనిపోయిన వారందరినీ అద్దె ఉంటున్న వారేనని పోలీసులు తెలిపారు. చెబుతున్నారు. వీరిలో కొందరు చదువుకునేవారు, మరికొందరు ఉద్యోగాలు చేసేవారు. మృతుల పేర్లు ఆశిష్, ఆకాంక్ష, గౌరవ్, నీతు సిసోడియా కాగా ఇద్దరి పేర్లు ధృవీకరించలేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి పేర్లు ఫిరోజ్, మునీరా, విశాల్, హర్షద్, సోనాలి. ప్రస్తుతం ఈ ప్రమాదంలో మృతుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.