LPG price: సామాన్యుడికి చమురు కంపెనీలు షాక్‌.. గ్యాస్‌ వినియోగదారునిపై మరో బండ

గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాకిచ్చాయి చమురు కంపెనీలు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచాయి.

LPG price: సామాన్యుడికి చమురు కంపెనీలు షాక్‌.. గ్యాస్‌ వినియోగదారునిపై మరో బండ
LPG Cylinder Price
Follow us
Ram Naramaneni

|

Updated on: May 07, 2022 | 9:30 AM

LPG cylinder price hike: శనివారం ఉదయాన్నే షాకింగ్ న్యూస్ చెప్పాయి చమురు సంస్థలు. సామాన్యులకు బ్యాడ్ న్యూస్ అందించాయి. గృహ వినియోగ గ్యాస్‌(LPG)  14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో ఢిల్లీలో సిలిండర్​ ధర రూ.999.50కి చేరింది. హైదరాబాద్‌లో రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది.  పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు తెలిపాయి. కాగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌ ధర ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 1న రూ.102.50 పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరతో ఢిల్లీలో రూ.2253గా ఉన్న కమర్షియల్ గ్యాస్​ బండ ధర రూ.2355.50కి చేరింది. హైదరాబాద్‌లో కమర్షియల్ బండ రూ.2,460 నుంచి 2,563.50కి చేరింది. ఇప్పటికే దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపు..పెను భారం అవ్వనుంది.  రోజురోజుకు పెరుగుతున్న ధరల మోతతో వంటగ్యాస్‌ సిలిండరు సామాన్యులు మోయలేనంత బరువెక్కుతోంది. దీంతో వంటలు చేసుకునేందుకు కట్టెల పొయ్యే దిక్కవుతుందని సామాన్యులు వాపోతున్నారు.  ఇప్పటికే నిత్యావసర సరుకులు, నూనె ధరలు భగ్గు మంటుండగా వంటగ్యాస్‌ ధర పెంచడం మోయలేని భారమే.

Also Read: Hyderabad: తప్ప తాగి డాక్టర్ బాబు ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసింది కాక.. పోలీసులకే రూల్స్