AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తప్ప తాగి డాక్టర్ బాబు ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసింది కాక.. పోలీసులకే రూల్స్

పోలీసులకు రూల్స్‌ నేర్పించబోయాడు ఓ డ్రంకన్‌ డాక్టర్. వారికి సహకరించకుండా నడిరోడోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Hyderabad: తప్ప తాగి డాక్టర్ బాబు ఓవరాక్షన్.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసింది కాక.. పోలీసులకే రూల్స్
Drunken Doctor
Ram Naramaneni
|

Updated on: May 07, 2022 | 9:01 AM

Share

తప్పతాగడం..ఆ తర్వాత డ్రైవింగ్ చేయడం.. ఇది చాలదన్నట్లు పోలీసులు ఆపితే రోడ్డెక్కి హల్‌చల్‌ చేయడం.. ఇప్పుడు కొందిరికి పరిపాటిగా మారిపోయింది. నగరంలో ఫుల్లుగా మందు కొట్టి నిషా నెత్తికెక్కి వీరంగం సృష్టిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. తాజాగా పాతబస్తీ(Old City) మలక్‌పేట్‌( malakpet)లో ఓ డాక్టర్‌.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబట్టాడు. ఫుల్లుగా మందు కొట్టిన ఆ వైద్యుడు..డ్రంక్‌ అండ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇది మీ పరిధి కాదంటూ హంగామా చేశాడు. పోలీసులకు రూల్స్‌ నేర్పించబోయాడు సదరు డ్రంకన్‌ డాక్టర్. పోలీసులకు సహకరించకుండా హల్‌చల్‌ చేశాడు.

మద్యం తాగి బండి నడపొద్దని పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. వాళ్ల లైఫ్‌ రిస్క్‌లో పడ్డమే కాదు..ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. తాగుబోతులు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారుతున్నారు. జరిమానాలు విధించినా..జైలుకు పంపుతున్నా మందు బాబుల ఆగడాలకు మాత్రం కళ్లెం పడ్డంలేదు. తాగిన మైకంలో యాక్సిడెంట్లు చేయడం..అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడం..దాడులకు సైతం పాల్పడ్డం నిత్యకృత్యాలవుతున్నాయి.

Also Read: Telangana: కంటైనర్ లారీ బోల్తా.. అందులో ఉన్నవి చూసి స్థానికులు షాక్