AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cuba Explosion: భారీ పేలుళ్లతో దద్దరిల్లిన క్యూబా.. 18 మంది మృతి, 64 మందికి గాయాలు

క్యూబాలో భారీ పేలుడు జరిగింది. రాజధాని హవానాలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందగా..మరో 64మందికి గాయాలయ్యాయి.

Cuba Explosion: భారీ పేలుళ్లతో దద్దరిల్లిన క్యూబా.. 18 మంది మృతి, 64 మందికి గాయాలు
Cuba Explosion
Balaraju Goud
|

Updated on: May 07, 2022 | 7:26 AM

Share

Cuba Hotel Explosion: క్యూబాలో భారీ పేలుడు జరిగింది. రాజధాని హవానాలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో శుక్రవారం శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది మృతి చెందగా..మరో 64మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్‌ లీకేజీతోనే ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.

హవానాలోని సరటోగా అనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి హోటల్​ బయట ఉన్న బస్సులు, కార్లు కూడా ధ్వంసమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ హోటల్‌ పక్కనే ఉన్న స్కూలును వెంటనే ఖాళీ చేయించారు అధికారులు. హవానాలోని సరాటోగా హోటల్‌లో గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించిందని అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కెనెల్ కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రజలు చిక్కుకునే అవకాశం ఉన్న దృష్ట్యా సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయం తరపున తెలిపారు. క్యూబా వార్తా సంస్థ ACN హవానాలోని హోటల్ సరాటోగాకు తీవ్ర నష్టం వాటిల్లిన చిత్రాలను ప్రచురించింది.

క్యూబాడేబేట్ అనే వెబ్‌సైట్ వార్తల ప్రకారం, హోటల్ పక్కనే ఉన్న ఒక పాఠశాల ఖాళీ చేయించారు. ఫైవ్ స్టార్ హోటల్ సరటోగాలో రెండు బార్‌లు, రెండు రెస్టారెంట్లు, ఒక స్విమింగ్ పూల్ ఉన్నాయి. కనీసం 13 మంది గల్లంతైనట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రమాద స్థలం చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇందులో అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రాణాపాయం తప్పింది.రోడ్డుపై చెత్తాచెదారం పడి, ధూళి మేఘం ఆకాశాన్ని కప్పేస్తోంది.

ఇవి కూడా చదవండి

పేలుడు జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కనెల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ప్రధాని మాన్యుయెల్ మర్రెరో క్రూజ్ కూడా ఉన్నారు. పేలుడులో దెబ్బతిన్న భవనం 19వ శతాబ్దానికి చెందినది. హోటల్ సరటోగా 2005లో ఇక్కడ ప్రారంభించారు. ఇది విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్. దెబ్బతిన్న భవనాలకు సమీపంలోనే కాన్సెప్షన్ అరేనల్ స్కూల్ కూడా ఉంది. ముగ్గురు చిన్నారులు గాయపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పేలుడు ధాటికి కిటికీలు పూర్తిగా పగిలిపోయాయి.

రాజధానిలో దాడి తర్వాత పిల్లలను పాఠశాల నుండి బయటకు పంపారని స్థానిక మీడియా పేర్కొంది. క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ వార్తాపత్రిక గ్రాన్మా ట్విట్టర్‌లో “ద్రవీకృత వాయువును బహుశా ట్రక్కు ద్వారా రవాణా చేస్తున్నప్పుడు పేలుడు సంభవించింది” అని పేర్కొంది. క్యూబాలో టూరిజం మరోసారి ట్రాక్‌లోకి వస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ద్వీప దేశం గత కొన్ని నెలలుగా ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ కారణంగా, ఈ దేశం చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.