AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand: అతనొక విశ్రాంత ఆర్మీ డాక్టర్.. భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు చేశాడంటే?

Thailand: ఓ వైపు భార్య ఉండగానే మరో మహిళలు పెళ్లి చేసుకునేవారు కొందరు.. భార్య మరణించిన కొన్ని రోజులకే వయసు తో సంబంధం లేకుండా మళ్ళీ పెళ్లికొడుకుగా మారే వ్యక్తుల గురించి చూస్తూనే..

Thailand: అతనొక విశ్రాంత ఆర్మీ డాక్టర్.. భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు చేశాడంటే?
Bangkok Man
Surya Kala
|

Updated on: May 07, 2022 | 8:23 AM

Share

Thailand: ఓ వైపు భార్య ఉండగానే మరో మహిళలు పెళ్లి చేసుకునేవారు కొందరు.. భార్య మరణించిన కొన్ని రోజులకే వయసు తో సంబంధం లేకుండా మళ్ళీ పెళ్లికొడుకుగా మారే వ్యక్తుల గురించి చూస్తూనే ఉన్నాం.. అయితే ఓ వృద్ధుడు మాత్రం తన భార్య మరణించింది అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు.. తన ప్రేమ శాశ్వతం అంటూ భార్య మృత దేహంతో దాదాపు 21 ఏళ్ళు జీవించాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తన భార్యకు తుది వీడ్కోలు పలికాడు. భార్య పార్దీవ దేహానికి(Dead Body) దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈ షాకింగ ఘటన థాయిలాండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

థాయ్‌ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని బ్యాంగ్ ఖేన్ జిల్లాలో విశ్రాంత సైనికాధికారి చార్న్ జన్వాచకల్ నివాసం ఉంటున్నారు. చార్న్ జన్వాచకల్ భార్య అనారోగ్యంతో రెండు దశాబ్దాల క్రితం మరణించింది. అయితే అప్పటి నుంచి భార్య మృతదేహాన్ని శవపేటికలో ఉంచి ఇంటిలోనే భద్రంగా చూసుకున్నాడు. రోజూ అతను తన భార్య మృత దేహంతో మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు జన్వాచకల్ వయసు 72 ఏళ్ళు.. దీంతో తన భార్య మృత దేహాన్ని ఇక భద్రపరచలేనని భావించినట్లు ఉన్నాడు.. చివరకు అంత్యక్రియలు నిర్వహించాడు. భార్య దహన సంస్కారాలు చేయడానికి ఫెట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్ నుండి సహాయం తీసుకుని కర్మకాండ పూర్తి చేశాడు. అంతటితో ఊరుకోలేదు. చితాభస్మాన్ని ఓ కలశంలో ఉంచి ఇంటికి తీసుకుపోయాడు. తాను బతికి ఉన్నంత వరకు అది తనతోనే ఉంటుందని అంటున్నాడు. ఈ దహన సంస్కారాల ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న తర్వాత న్యాయవాది Nitithorn Kaewto చార్న్ జన్వాచకల్ ను సందర్శించి ఇంటర్వ్యూ చేశారు. చార్న్ జన్వాచకల్ చదువుకున్నాడని, అనేక డిగ్రీలు సంపాదించాడని తెలుసుకుని షాక్ తిన్నాడు. అయితే చార్న్ జన్వాచకల్ కనీససదుపాయాలు లేవని.. ఇంటికి కరెంటు లేదని తెలిపారు.

అతను తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవించేవాడని.. అయితే ఆమె మరణించినప్పుడు ఆమె మృతదేహాన్ని  ఇంట్లో పెట్టుకోవడంతో తని కుమారులు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని న్యాయవాది తెలిపారు. చార్న్ జన్వాచకల్ రాయల్ థాయ్ ఆర్మీలో వైద్యుడిగా విధుల నిర్వహించడానికి ముందు..  యూనివర్శిటీలోని ఫార్మసీ ఫ్యాకల్టీ గా పనిచేసేవారిని చెప్పారు. ఇక అతని భార్య ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేసినట్లు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Zomato: జొమాటో సీఈవో సంచలన నిర్ణయం.. తమ ఉద్యోగస్తుల పిల్లల చదువు కోసం రూ.700 కోట్లు భారీ విరాళం..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..