AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zomato: జొమాటో సీఈవో సంచలన నిర్ణయం.. తమ ఉద్యోగస్తుల పిల్లల చదువు కోసం రూ.700 కోట్లు భారీ విరాళం..

Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ (CEO Deepinder Goyal)  సంచలన నిర్ణయం తీసుకున్నారు. జొమాటోలో ఉద్యోగం చేస్తూ.. తన సంస్థ అభివృధ్ధికోసం..

Zomato: జొమాటో సీఈవో సంచలన నిర్ణయం.. తమ ఉద్యోగస్తుల పిల్లల చదువు కోసం రూ.700 కోట్లు భారీ విరాళం..
Zomato Ceo
Surya Kala
|

Updated on: May 07, 2022 | 7:41 AM

Share

Zomato: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ (CEO Deepinder Goyal)  సంచలన నిర్ణయం తీసుకున్నారు. జొమాటోలో ఉద్యోగం చేస్తూ.. తన సంస్థ అభివృధ్ధికోసం పాటుపడుతున్న డెలివరీ భాగస్వాముల పిల్లల విద్యకు భారీగా విరాళం ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 90 మిలియన్‌ డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 700 కోట్లు) విరాళం ఇవ్వనున్నారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్‌కు వెస్టెడ్ ESOPల నుండి USD 90 మిలియన్ (దాదాపు ₹ 700 కోట్లు) విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

“గత నెలలో సగటు షేర్ ధర ప్రకారం.. ఈ ESOPల విలువ USD 90 మిలియన్ (సుమారు ₹ 700 కోట్లు)” అని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ మొత్తాన్ని తాను ఎలా ఉపయోగించాలనుకుంటున్నాడో కూడా గోయల్ తెలిపారు. తాను ఈ ESOPల (పన్నుల నికర) నుండి వచ్చే మొత్తం మొత్తాన్ని Zomato ఫ్యూచర్ ఫౌండేషన్ (ZFF)కి విరాళంగా ఇస్తున్నానని చెప్పారు. ఈ మొత్తం జొమాటోలో ఐదేండ్లకు పైగా తమ సంస్థలో సేవలు అందిస్తున్న డెలివరీ భాగస్వాముల పిల్లలు ఇద్దరికి.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ. 50,000 చొప్పున సాయం అందించనున్నామని తెలిపారు.

కంపెనీలో 10 ఏండ్లు సర్వీస్‌ పూర్తిచేసుకున్న పార్టనర్ల పిల్లలకు ఈ సహాయం రూ. 1 లక్ష వరకూ ఉంటుందని గోయల్‌ వివరించారు.

అయితే, “మహిళా డెలివరీ భాగస్వాములకు 5/10 సంవత్సరాల  సర్వీసుకంటే తక్కువ ఉన్నా ఈ సదుపాయం వర్తిస్తుందని చెప్పారు గోయల్. ఇక బాలికల కోసం ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టనున్నామని.. ఒక అమ్మాయి ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుంటే..’ప్రైజ్ మనీ’ని కూడా ప్రవేశపెట్టి.. ప్రతిభను బట్టి బహుమతిగా కొంత సొమ్ముని అందిస్తామని చెప్పారు. ఇక సర్వీసులో ఉండగా.. ఎవరైనా అనికొని ప్రమాదాలకు గురైతే.. సర్వీసు సంబంధం లేకుండా వారి కుటుంబాలకు విద్య,  జీవనోపాధి అందించబడుతుందని దీపిందర్ గోయల్ చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Anantapur: ఎస్సై ప్రేమ వంచనకు ఓ యువతి బలి.. విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి..