Fixed Deposit: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు
Fixed Deposit: ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెబుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ..
Fixed Deposit: ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకులు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెబుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి. ఇక తాజాగా కొటాక్ మహింద్రా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు సదరు బ్యాంకు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్ల కూడా అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉన్న డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లను పెంచిన కొటాక్ మహింద్రా బ్యాంకు.. 30 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల మధ్యలో పెంచింది. పెంచిన వడ్డీ రేట్ల తర్వాత 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.5 శాతం నుంచి 5.75 శాతం మధ్యలో ఆఫర్ చేస్తోంది.
☛ 7 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.5 శాతం
☛ 31 రోజుల నుంచి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3 శాతం
☛ 91 రోజుల నుంచి 179 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది బ్యాంకు.
☛ ఇక 180 రోజుల నుంచి 363 రోజుల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 4.75 శాతం
☛ 364 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లకు 5.25 శాతం వడ్డీని అందిస్తుంది.
☛ 390 రోజుల నుంచి 23 నెలల కంటే తక్కువ వ్యవధిలో డిపాజిట్లకు 5.50 శాతం
☛ 23 నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 వడ్డీని బ్యాంకు అందించనున్నట్టు తెలిపింది.
☛ 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 5.75 శాతం అందిస్తోంది.
☛ కొటక్ మహింద్రా బ్యాంకుతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు, బంధన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: