RBI: రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం.. SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆదివారం అన్ని బ్రాంచులు ఓపెన్..
RBI: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)లో సామాన్య ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ..
RBI: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)లో సామాన్య ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. ఎల్‌ఐసీ ఐపీఓ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఏఎస్‌బిఎకు చెందిన అన్ని శాఖలను ఆదివారం అంటే మే 8న తెరవాలని ఆర్‌బీఐ ఎస్బీఐని ఆదేశించింది. అన్ని ఏఎస్‌బీఏ సంబంధింత బ్రాంచులను ఆదివారం ఈ మెగా ఐపీఓ కోసం తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ASBA ద్వారా ఇష్యూ కోసం దరఖాస్తు చేస్తారు. LIC IPO మే 9న ముగుస్తుంది. 3.5 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏఎస్‌బీఏ అనేది సెల్ఫ్ సర్టిఫైడ్ సిడింకేట్ అథరైజేషన్ కలిగిన ఇన్వెస్టర్ అప్లికేషన్. ఇది ష్యూను సబ్‌స్క్రయిబ్ చేసుకునేందుకు బ్యాంకు అకౌంట్‌లో మీ అప్లికేషన్ మనీని బ్లాక్ చేస్తుంది. ఏఎస్‌బీఏ ద్వారా ఇన్వెస్టర్ దరఖాస్తు చేసుకుంటే.. షేర్ల అలాట్‌మెంట్ అయిన తర్వాత బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. అయితే ఆదివారం బ్రాంచులను తెరవడమే మాత్రమే కాకుండా ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే వారికి మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఐపీఓలో పాల్గొనే ఎల్ఐసీ ఉద్యోగులకు ఎస్‌బీఐ స్పెషల్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు రుణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ రుణంపై వడ్డీ రేటును కూడా 7.10 శాతంగానే విధిస్తోంది. రుణం టెన్యూర్ 60 నెలలు ఉంది. ఈ లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ పెనాల్టీలు ఉండవు. ఈ ఇష్యూలో మొత్తం షేర్లలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఐపీఓ ధరలో ఉద్యోగులకు రూ.45 తగ్గింపు ఇస్తోంది. 10% వాటా LIC పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేయబడింది. పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు ఇస్తోంది.
Here’s a good news for all our customers applying for LIC IPO!#LIC #IPO #Investment #Finance #SBI #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/FdhxO3iuso
— State Bank of India (@TheOfficialSBI) May 6, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి