Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. నిన్న 10 గ్రాముల బంగారం ధరపై రూ.420 వరకు పెరుగగా, ప్రస్తుతం తగ్గుముఖం ..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2022 | 6:13 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. నిన్న 10 గ్రాముల బంగారం ధరపై రూ.420 వరకు పెరుగగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. తాజాగా మే 7న (శనివారం) 10 గ్రాముల ధరపై రూ.320 వరకు తగ్గింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,810 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం ధర తగ్గితే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధరపై రూ.1500 వరకు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,500 ఉండగా, విజయవాడలో రూ.66,500 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.66,500 ఉండగా, ముంబైలో రూ.62,300 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.62,300 ఉండగా, కోల్‌కతాలో రూ.62,300 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,500 ఉండగా, కేరళలో రూ.66,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jio Recharge Plans: రిలయన్స్‌ జియోలో అద్భుతమైన ప్లాన్‌.. రూ.155 రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ, ఇంటర్నెట్‌ సదుపాయం

Jio Q4 Results: రిలయన్స్‌ జియోకు నాలుగో త్రైమాసికంలో పెరిగిన లాభం.. క్యూ4 ఫలితాలు విడుదల