Jio Q4 Results: రిలయన్స్‌ జియోకు నాలుగో త్రైమాసికంలో పెరిగిన లాభం.. క్యూ4 ఫలితాలు విడుదల

Jio Q4 Results: పన్ను తర్వాత దాని స్వతంత్ర లాభంలో 24 శాతం పెరుగుదల కనిపించిందని రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికం..

Jio Q4 Results: రిలయన్స్‌ జియోకు నాలుగో త్రైమాసికంలో పెరిగిన లాభం.. క్యూ4 ఫలితాలు విడుదల
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2022 | 9:40 PM

Jio Q4 Results: పన్ను తర్వాత దాని స్వతంత్ర లాభంలో 24 శాతం పెరుగుదల కనిపించిందని రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.4,173 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.3,360 కోట్ల పన్ను తర్వాత లాభం ( పీఏటీ) ఉందని కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. కార్యకలాపాల ద్వారా తమ స్వతంత్ర ఆదాయం 20 శాతం పెరిగి రూ .20,901 కోట్లకు చేరుకుందని తెలిపింది. మార్చి 31, 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ జియో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (PAT) దాదాపు 23 శాతం పెరిగి రూ. 14,854 కోట్లకు చేరుకుంది. ఇది 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.12,071 కోట్లుగా ఉంది.

కంపెనీ మార్జిన్ ఎంత?

కంపెనీ ఎబిటా అంచనాల కంటే ఎక్కువగా రూ.10,510 కోట్లుగా ఉంది. అదే సమయంలో నాల్గవ త్రైమాసికంలో కంపెనీ మార్జిన్ 50.3 శాతంగా ఉంది. అంతకుముందు, ముఖేష్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్‌ల ఏకీకృత లాభం 8.9 శాతం పెరిగి రూ. 3,795 కోట్లకు చేరుకుందని రిలయన్స్‌ పేర్కొంది. ఈ విభాగంలో కంపెనీ మొత్తం ఆదాయం 13.8 శాతం పెరిగి రూ.24,176 కోట్లకు చేరుకుంది. ఈ విభాగంలో ఎబిటా 18 శాతం పెరిగి రూ.10,008 కోట్లకు చేరుకుంది. కాగా, నగదు లాభం 14.7 శాతం పెరిగి రూ.8,747 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో మొత్తం 1.02 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లు జియోకి చేరారు. జియో మొత్తం సబ్‌స్క్రైబర్లు ప్రస్తుతం 421 మిలియన్లుగా ఉన్నారు. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.18,549 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం 41.5 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత ఆదాయం 54.25 శాతం పెరిగి రూ.1,91,271 కోట్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈ ఏడాది ముందుగానే వడ్డీ జమ.. ఎప్పుడంటే..!

Mother’s Day Offer: ‘మాతృ దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్‌.. రూ.1999 షాపింగ్ చేయండి.. రూ.500 తగ్గింపు పొందండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!