EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈ ఏడాది ముందుగానే వడ్డీ జమ.. ఎప్పుడంటే..!

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రతీ సంవత్సరం పీఎఫ్‌ (PF) ఖాతాదారులకు వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈ ఏడాది ముందుగానే వడ్డీ జమ.. ఎప్పుడంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2022 | 5:45 PM

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రతీ సంవత్సరం పీఎఫ్‌ (PF) ఖాతాదారులకు వడ్డీ జమ చేస్తూ ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ప్రతీ సంవత్సరం జమ చేస్తుంది. ప్రతీసారి ఈ వడ్డీ చాలా ఆలస్యంగా జమ అవుతుంది. అయితే ఈసారి కాస్త ముందుగానే ఈపీఎఫ్ వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తున్నట్టు సమాచారం. అంటే దసరా లేదా దీపావళి పండగ సీజన్‌ కంటే ముందే వడ్డీ అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ వడ్డీరేటు 43 ఏళ్ల కనిష్ట స్థాయిల్లో 8.1 శాతంగా ఉంది. అయితే దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ అమోదించేలా కనిపిస్తోంది. అలాగే వడ్డీని ముందుగానే క్రెడిట్‌ చేస్తే ఈపీఎఫ్‌ఓ ఫైనాన్సియల్‌ హెల్త్‌కు ప్రయోజనం ఉంటుంది. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ త్వరగా క్రెడిట్‌ అయ్యేలా కనిపిస్తోంది. లక్షలాది మంది ఉద్యోగులకు బోనస్‌లు దసరా-దీపావళి పండగ సీజన్‌కు ముందు వస్తాయి. ఈ సమయంలోనే వడ్డీ రేట్లు ఇచ్చి డబుల్‌ బోనస్‌లను ఉద్యోగులకు అందజేస్తారు.

ఇదిలా ఉండగా, 2021 ఆర్థిక సంవత్సరంలో EPF వడ్డీని డిసెంబర్ 2021లో ఖాతాదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు మార్చి నెలలోనే పీఎఫ్‌ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించింది.  కాగా, ప్రభుత్వ ప్రకటన వచ్చేంత వరకు ఏదీ కూడా తుది నిర్ణయం కాదు. సెంట్రల్ బోర్డు వడ్డీ రేటు ప్రతిపాదనలను ముందుగా ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించాల్సి ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Mother’s Day Offer: ‘మాతృ దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్‌.. రూ.1999 షాపింగ్ చేయండి.. రూ.500 తగ్గింపు పొందండి

Apple: యాపిల్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. ఆ సదుపాయానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిర్ణయం..