Mother’s Day Offer: ‘మాతృ దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్‌.. రూ.1999 షాపింగ్ చేయండి.. రూ.500 తగ్గింపు పొందండి

Mother's Day Offer: మే 8వ తేదీన మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మలందరికీ సరైన, అత్యుత్తమ బహుమతి ఏమివ్వాలో ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఇది..

Mother's Day Offer: 'మాతృ దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్‌.. రూ.1999 షాపింగ్ చేయండి.. రూ.500 తగ్గింపు పొందండి
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2022 | 4:17 PM

Mother’s Day Offer: మే 8వ తేదీన మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మలందరికీ సరైన, అత్యుత్తమ బహుమతి ఏమివ్వాలో ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఇది సరైన సమయం. మహిళల కోసం ప్రత్యేకమైన ఒక ప్రయోగాత్మక సంప్రదాయ దుస్తుల స్టోర్ ‘అవంత్రా బై ట్రెండ్స్‘ (AVANTRA by TRENDS) రూ.1999 షాపింగ్ చేస్తే రూ.500 తగ్గింపుతో ఒక అద్భుతమైన ఆఫర్‌తో ప్రత్యేకమైన మదర్స్ డే కలెక్షన్‌ని విడుదల చేస్తోంది. సంప్రదాయం, సంస్కృతి, వారసత్వానికి విలువనిచ్చి, భారతీయ, జాతి అనే ప్రతిదాన్ని జరుపుకొనే సమకాలీన భారతీయ మహిళ (Indian womens) కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త కాన్సెప్ట్ ‘అవంత్రా బై ట్రెండ్స్’.

అద్భుతమైన స్టోర్ వాతావరణం, అసిస్టెడ్ సర్వీస్, సెల్ఫ్ సర్వీస్‌తో వినూత్నమైన రిటైల్ అనుభవం, చీర కట్టడానికి స్టైలింగ్ స్టేషన్, నాన్ షాపర్ లాంజ్, కాంప్లిమెంటింగ్ ఉత్పత్తి విభాగాలు, బ్లౌజ్ కుట్టడం, చీర ఫినిషింగ్, రెడీమేడ్ చీరలు, పీకో, ఫాల్స్ కుట్టడం వంటి మరెన్నో టైలరింగ్ సర్వీస్‌ల ద్వారా సమకాలీన భారతీయ మహిళల షాపింగ్ అనుభవాన్ని స్టోర్ పునర్నిర్వచించింది.

విభిన్న టెక్స్‌టైల్ క్రాఫ్ట్‌ల అనేక రంగుల సమ్మేళణం, భారతదేశంలోని ఉత్తమ పట్టు, అత్యుత్తమ సంప్రదాయ దుస్తుల బ్రాండ్‌లు కలిగి ఫ్యాషన్, నాణ్యత, సరసమైన ధరలు కలిగి ఉన్న అవంత్రా బై ట్రెండ్స్ ఒక సంపూర్ణ ప్రయోగాత్మక స్టోర్. దీనిలో పట్టు నుంచి సింథటిక్స్ వరకు చీరలు, బ్లౌజులు, భారతీయ దుస్తులు, యాక్ససరీలు, పాదరక్షలు కలిగి ఉన్న విస్తృత శ్రేణితో పాటు సౌకర్యవంతమైన ఇన్ స్టోర్ టైలరింగ్ సర్వీసులు ఉండి మహిళల సంప్రదాయ దుస్తులకి వన్-స్టాప్ డెస్టినేషన్‌గా ఉంది. ‘అవంత్రా బై ట్రెండ్స్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25+ చీరల క్రాఫ్ట్ క్లస్టర్లు, 11 రాష్ట్రాలని కవర్ చేసే 10 మంది అవార్డ్ విన్నింగ్ చేనేత కళాకారులు/అత్యుత్తమ పనితీరు కలవారితో సహా 80+ నేత కార్మికులు, డిజైనర్లు, హస్తకళాకారులు, అన్నిట్లో ఉత్తమ పనితీరు ప్రదర్శించే వారితో కలిసి పనిచేస్తోంది.

తక్కువ ధరల్లో దుస్తులు:

రోజు వారీ చీరలు, వివిధ సందర్భానుసారంగా కట్టే చీరలు, పట్టు చీరలు, చేనేత చీరలు, కాటన్ చీరలు, ఫ్యాన్సీ చీరలపై ఆఫర్లు ఉన్నాయి. ఈ చీరలు రూ. 399 నుంచి రూ. 39,999 వరకు అందుబాటులో ఉన్నాయి.  ఇక మిగిలిన దుస్తులు రూ. 99 నుంచి రూ. 1,999 వరకు ఉంటాయి. చీరల కేటగిరీ అనేది రూ.50,000+ కోట్ల మార్కెట్. ‘అవంత్రా బై ట్రెండ్స్’ మొదటి పాన్-ఇండియా బ్రాండ్‌గా స్థానం పొందింది. ఇది మెట్రోస్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 మార్కెట్లలో ఉనికిని పెంచుకుంటూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అన్ని దక్షిణాది రాష్ట్రాలలో సుమారు 70 స్టోర్లని ప్రారంభించే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అలాగే ఇతర రాష్ట్రాలకు విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ట్రెండ్స్ గురించి..

ట్రెండ్స్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద దేశీయ ఫ్యాషన్ రిటైల్ చైన్. ట్రెండ్స్ తన స్వంత ఫ్యాషన్ బ్రాండ్లు, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ల వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోతో ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాషన్ యాక్ససరీలలో స్టైలిష్, అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులని అందిస్తుంది. ప్రతి ట్రెండ్స్ స్టోర్‌లో విశాలమైన నడక మార్గాలు, సమన్వయ ప్రదర్శనలు, అత్యుత్తమ కస్టమర్ అసిస్టెన్స్‌ని అందించే శిక్షణ పొందిన ఫ్యాషన్ ప్రొఫెషనల్స్‌తో మొత్తం కుటుంబానికి ఒక ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందించడం కోసం డిజైన్ చేసిన చైన్.

రిలయన్స్ రిటైల్ గురించి..

రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. ఇది ఆర్ఐఎల్ గ్రూప్ కింద ఉన్న అన్ని రిటైల్ కంపెనీలకి హోల్డింగ్ కంపెనీ. మార్చి 31, 2021 తో ముగిసిన సంవత్సరానికి ఆర్ఆర్‌వీఎల్ రూ. 157,629 కోట్ల (21.6 బిలియన్ డాలర్లు) ఏకీకృత టర్నోవర్, నికర లాభం రూ. 5,481 కోట్లు (750 మిలియన్ డాలర్లు) నివేదించింది. రిలయన్స్ రిటైల్ విస్తృత రీచ్ తో భారతదేశంలో అతిపెద్ద, అత్యంత లాభదాయకమైన రిటైలర్. డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2021 ఇండెక్స్‌లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్లలో ఇది ఉంది. టాప్ గ్లోబల్ రిటైలర్ల జాబితాలో ఇది 53వ స్థానంలో ఉంది. టాప్ 100లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రిటైలర్‌గా నిలిచింది.

Avantra

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Wheat: దేశంలో భారీగా పెరుగుతున్న గోధుమల ధరలు.. కారణం అదే..

Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..