Viral: ఇంట్లోని పెరట్లో నక్కిన సింహం.. సమాచారంతో అధికారులు హైఅలెర్ట్.. చివరకు తుస్…..
సింహం కనిపించిందనే ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయుధాలతో ముగ్గురు అధికారులు ఆ ప్రాంతానికి వచ్చారు.
రోజూ లానే ఆ వ్యక్తి తన యజమాని ఇంటికి పని నిమిత్తం వెళ్లాడు. అయితే ఆ రోజు ఓనర్ ఏదో పని మీద బయటకు వెళ్ళింది. దీంతో యధావిధిగానే ముందుగా వెళ్లి ఇంటి గార్డెన్‌లోని మొక్కలకు నీళ్లు పడదామనుకున్నాడు. అక్కడకు వెళ్లగానే చెట్ల మధ్య నక్కి ఉన్న సింహాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే అక్కడి నుంచి లగెత్తి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేశాడు. వెంటనే అలెర్టైన్ అధికారులు.. సింహాన్ని బంధించేందుకు అవసరమైన సరంజామాతో అక్కడికి చేరుకున్నారు. అప్రమత్తంగా ఆ స్థలానికి చేరుకున్న అధికారులకు.. ఆ సింహం.. కదలకుండా.. మెదలకుండా ఉండటంతో అనుమానం వచ్చింది. మనుషులు కనిపించినా.. దానిలో కదలిక లేదు. దీంతో దగ్గరకు వెళ్లగా.. అప్పుడు అసలు విషయం రివీలైంది. అది ఓ షాపింగ్ బ్యాగ్ మీదున్న సింహం బొమ్మ. ఆ బ్యాగును చెట్ల మధ్య ఉంచి వెళ్లారు. సంచిపై ఉన్న సింహం బొమ్మను చూసి.. నిజమైన సింహం అనుకోవడంతో.. ఈ తతంగం అంతా జరిగింది. ఈ ఘటన కెన్యాలోని కిన్యాయా గ్రామంలో జరిగింది. ఆ ఇంటి ఓనరే ఆ బ్యాగ్‌ను చెట్ల పొదల్లో పెట్టారు. అందులో మట్టివేసి అవకాడో మొక్కలను పెంచుతున్నారు. ఎండలకు మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు దాన్ని చెట్ల నీడలో ఉంచారు. ఇది అసలు మేటర్.
అటవీ అధికారులు వచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్ అక్కడ లేరు. విషయం తెలిసి ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, సింహం ఉన్నట్లు ఆమెకు చెప్పి మరోవైపు నుంచి ఇంటి లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. ఆమెకు కూడా ఆ బ్యాగ్‌పై ఉన్న సింహం బొమ్మ గురించి ఐడియా రాకపోవడంతో కాసేపు హైటెన్షన్ నడిచింది. దాని దగ్గరగా ఉన్న కిటికీలోనుంచి చూడగా సింహం ముఖం తప్ప మిగతా శరీరం కనిపించలేదు. అప్పుడు అది నిజానికి షాపింగ్ బ్యాగ్ అని రివీలైంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: KGF actor: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..