AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ తెల్లవారు 3 గంటల వరకు బార్లు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్..

Liquor: మద్యం ప్రియులకు అక్కడి ప్రభుత్వం ఒక కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది. అదేంటే ఇకపై రాత్రి పూట బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని పెంచుకున్నట్లు ప్రకటించింది. ఇంకా..

Liquor: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ తెల్లవారు 3 గంటల వరకు బార్లు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్..
Bars
Ayyappa Mamidi
|

Updated on: May 07, 2022 | 12:06 PM

Share

Liquor: ఢిల్లీ ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం మంచి కిక్కించే వార్త చెప్పింది. దేశ రాజధానిలో నైట్ లైఫ్ పెంచే ప్రయత్నంలో భాగంగా.. తెల్లవారుజాము 3 గంటల వరకు మద్యం తాగేందుకు బార్‌లను అనుమతించేలా విధాన నిర్ణయం తీసుకుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు ఇందుకు అవసరమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

రెస్టారెంట్లలోని బార్‌లు ప్రస్తుతం తెల్లవారుజామున ఒంటి గంట వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు సమయం పొడిగిస్తే ఎక్సైజ్ శాఖ పోలీసులతో సహా ఇతర ఏజెన్సీలతో కలిసి పని చేయనున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. నవంబర్ 2021 నుంచి అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీ.. బార్ల నిర్వహణ సమయాలను పొరుగు నగరాలతో సమానంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం హర్యానాలోని ఎన్‌సీఆర్ నగరాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు నడిపేందుకు అనుమతి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్‌లలో బార్లు తెల్లవారుజామున ఒకటి వరకు తెరిచి ఉంటాయి.

రెస్టారెంట్‌ల సమయాన్ని పొడిగించాలని, తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచి ఉంటే ఎలాంటి గొడవలు, వేధింపులు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఎక్సైజ్ శాఖను కోరారు. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ప్రెసిడెంట్ కబీర్ సూరి మాట్లాడుతూ.. హాస్పిటాలిటీ రంగం భారీగా లైసెన్స్ ఫీజు చెల్లించిందని, అయితే ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం సమయాలను మార్చకపోవడంతో నష్టపోయామని చెప్పారు. సాఫీగా వ్యాపారం కోసం పరిస్థితులను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.

ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచడం, హోటల్, క్లబ్, రెస్టారెంట్ సెగ్మెంట్ లైసెన్సుదారులకు అనుకూల వాతావరణం, పరిస్థితులను అందించడం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, పాలసీ అనేక సిఫార్సులను చేసింది. లైసెన్స్ రుసుము హేతుబద్ధీకరణ, మద్యపానం చట్టబద్ధమైన వయస్సును 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించడం, ఇండిపెండెెంట్ రెస్టారెంట్లలో సంగీతాన్ని అనుమతించకూడదని సంబంధించిన పాత నిబంధనలను తొలగించడం వంటివి సిఫార్సుల్లో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి..

Insurance: పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సేవలు.. ఇలా కవరేజ్ పొందండి..

Bank Branches: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. 600 బ్రాంచ్‌ల మూసివేతకు రంగం సిద్ధం..? ఎందుకంటే..!