Bank Branches: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. 600 బ్రాంచ్‌ల మూసివేతకు రంగం సిద్ధం..? ఎందుకంటే..!

Bank Branches: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం (దాదాపు 600 శాఖలు) బ్రాంచ్‌లను మూసివేత లేదా.. విలీనం చేయాలని..

Bank Branches: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. 600 బ్రాంచ్‌ల మూసివేతకు రంగం సిద్ధం..? ఎందుకంటే..!
Follow us

|

Updated on: May 07, 2022 | 9:35 AM

Bank Branches: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై కేంద్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం (దాదాపు 600 శాఖలు) బ్రాంచ్‌లను మూసివేత లేదా.. విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్న బ్రాంచ్‌లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి శాఖల తగ్గింపుపై నిర్ణయం అమల్లోకి రాబోతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా బ్యాంక్‌ స్థితిగతులను మెరుగు పరిచేందుకు ఇండ్ల స్థలాలు, నాన్‌కోర్‌ ఆస్థులను అమ్మాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే గతంలో పొదుపు చర్యలు తీసుకున్నట్టు వార్తలు వచ్చినా.. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా శాఖలను మూసివేసే అంశం ప్రస్థావనకు రాలేదు.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌కు 100 ఏళ్ల చరిత్ర:

ఇదిలా ఉండగా, సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు వందేళ్ల చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా 4,594 బ్రాంచ్‌లు ఉన్నాయి. 2017వ సంవత్సరంలో RBI రూపొందించిన మార్గదర్శకాలు.. నిబంధనలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థలు ఉల్లంఘించాయని తెలుస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు క్లోజ్‌ చేసే అంశంపై ఆ బ్యాంక్‌ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. 2017లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక బ్యాంకులు RBI ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (PCA) జాబితాలో చేర్చబడ్డాయి. ఈ జాబితాలోకి వచ్చే బ్యాంకులకు అనేక ఆంక్షలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం కల్పించారు. కాగా, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మినహా మిగిలిన అన్ని బ్యాంకులు పీసీఏ జాబితా నుంచి బయటకువచ్చాయి. కానీ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఆర్థిక పరిస్థితులు మెరుగు పడకపోవడంతో జాబితాలో అలానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో 600 శాఖలను మూసివేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Post Office: పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతాను ఎవరెవరు తెరవవచ్చు.. వడ్డీ రేటు ఎంత..? పూర్తి వివరాలు

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!