Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

Petrol-Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు భారంగా మారుతోంది. క్రూడాయిల్ ధర మళ్లీ పెరుగుతూ బ్యారెల్ ధర 113 డాలర్ల స్థాయికి చేరుకుంది. గత మూడు..

Petrol-Diesel Price Today: వాహనదారులకు ఊరట.. తాజా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!
Follow us
Subhash Goud

|

Updated on: May 07, 2022 | 8:14 AM

Petrol-Diesel Price Today: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాహనదారులకు భారంగా మారుతోంది. క్రూడాయిల్ ధర మళ్లీ పెరుగుతూ బ్యారెల్ ధర 113 డాలర్ల స్థాయికి చేరుకుంది. గత మూడు రోజులుగా క్రూడాయిల్ ధర నిరంతరం పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సగటు ధర లీటరుకు $ 1.33 అంటే రూ. 102 స్థాయిలో ఉంది. ప్రస్తుతం భారతదేశం (India)లో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.113గా ఉంది. ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా చివరిసారిగా చమురు ధరలను పెంచారు. ఏప్రిల్ 6 నుండి ఇంధన ధరలలో పెంపు లేదా తగ్గింపు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. తాజాగా మే 7వ తేదీన పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49 ఉండగా, డీజిల్‌ ధర రూ.105.49గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ రూ.115.12 ఉండగా, డీజిల్ ధర రూ.99.83 ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.85 ఉండగా, డీజిల్ రూ.100.94గా ఉంది.

మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య పెట్రోల్ ధర రూ.10 పెరిగింది. చివరిసారిగా ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరిగాయి. అంతకుముందు అంటే నవంబర్ 4, 2021 నుండి మార్చి 21, 2022 వరకు దేశం మొత్తంలో ఇంధన ధరలు పూర్తిగా స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత 2022 మార్చి 22 నుంచి చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. మార్చి 22, ఏప్రిల్ 6 మధ్య, ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.10 పెరిగింది. ఇక పెట్రోలు మరియు డీజిల్‌పై పన్ను ఢిల్లీలో మే 1 నాటికి పెట్రోల్ బేస్ ధర రూ.56.33. లీటరుకు రవాణా ఖర్చు రూ.0.20 వర్తిస్తుంది. ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.27.90, వ్యాట్ రూ.17.13. ఇందులో లీటరుకు డీలర్ కమీషన్ రూ.3.85 ఉండగా, 105.41 రూపాయలకు చేరుకుంది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్‌ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్‌ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Fixed Deposit: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. ఇదే బాటలో మరిన్ని బ్యాంకులు

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం.. SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఆదివారం అన్ని బ్రాంచులు ఓపెన్‌..