Viral Video: కర్రతోనే అడవికి రారాజు సింహాన్ని భయపెట్టిన యువకుడు.. నెట్టింట్లో వీడియో వైరల్
Viral Video: అడవికి రారాజు అయిన సింహం(Lion) కేవలం కర్రతో ఒంటరిగా అడవిలోకి వెళ్లిన వ్యక్తిని చూసి భయభ్రాంతులకు గురయ్యింది. వింత వీడియో సోషల్ మీడియాలో(Social Media)..
Viral Video: అడవికి రారాజు అయిన సింహం(Lion) కేవలం కర్రతో ఒంటరిగా అడవిలోకి వెళ్లిన వ్యక్తిని చూసి భయభ్రాంతులకు గురయ్యింది. వింత వీడియో సోషల్ మీడియాలో(Social Media) ప్రత్యక్షమైంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘animals_powers’ అనే పేజీ షేర్ చేశారు. ‘సింహాన్ని భయపెట్టిన మనిషి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ వీడియోకి ‘. వివరాల్లోకి వెళ్తే..
సింహం అంటే అడవికి రాజు. దానిని చూస్తే ఎంతటి జంతువైనా తోక ముడవాల్సిందే.. అలాంటి సింహం ఓ వ్యక్తిని చూసి తోక ముడుచుకుని పారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవి మధ్యలో ఒక సింహం ఉంది. అక్కడికి ఒంటరిగా ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే అతను సింహాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి.. ఆ సింహాన్నే పరుగులు పెట్టించాడు. కర్రతో దానిని చిన్న పిల్లాడిని తండ్రి భయపెట్టినట్టు పెంపుడు కుక్కపిల్లతో సరదాగా ఆడుతున్నట్లు అదిలించాడు.
ఆ సిహం కూడా వద్దు నాన్న… నన్ను కొట్టొద్దు అన్నట్టుగా మారాం చేస్తూ.. అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియోకి ‘మనిషిని చూసి సింహం భయపడింది’ అన్న శీర్షికతో పోస్ట్ చేశారు. కాగా లక్షలమంది ఈ వీడియోను వీక్షిస్తూ..వేలల్లో లైక్ చేస్తున్నారు. మనిషిని చూసి సింహం భయపడటమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తికి చివరి కోరిక ఏదో మిగిలి ఉండి ఉంటుంది.. అందుకే సింహం అతడిని తినేయకుండా వదిలిపెట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: KGF actor: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..
Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో కమల్ సందడి.. మీరు గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అంటున్న కపిల్
Chanakya Niti: ఈ జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య (Photo Gallery)