AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today(07-05-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: May 07, 2022 | 6:40 AM

Share

Horoscope Today(07-05-2022): రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 7వ తేదీ )శనివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు అనుకోని విధంగా లాభాలను పొందుతారు. అనారోగ్య బాధలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రయాణం వలన లాభిస్తుంది. ఆవేశం, తొందర పాటు వలన కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడతాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు స్థిరాస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా ఆందోళన కలుగుతుంది. చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగస్తులకు వృద్ధి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి గ్రహ బలం విశేషంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్తపనులను మొదలు పెడతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకోవడానికి ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. నూతన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ప్రయాణాలు అధికంగా చేయాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలు కలుగుతాయి. స్త్రీలు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభఫలితాలను అందుకుంటారు. శుభ వార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. అనారోగ్యనికి గురయ్యే అవకాశము ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.  రుణప్రయత్నం ఫలిస్తుంది.  కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలను ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

Srilanka Emergency: మళ్లీ లంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు రాజపక్స.. కారణం అదే..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి