Srilanka Emergency: మళ్లీ లంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు రాజపక్స.. కారణం అదే..

Srilanka Emergency: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో అక్కడి ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Rajapaksa) మరోసారి ఎమర్జెన్సీ విధించారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.

Srilanka Emergency: మళ్లీ లంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు రాజపక్స.. కారణం అదే..
Srilanka
Follow us

|

Updated on: May 07, 2022 | 6:24 AM

Srilanka Emergency: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో అక్కడి ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ రాజపక్స(Rajapaksa) మరోసారి ఎమర్జెన్సీ విధించారు. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. లంక దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇది రెండోసారి. ఐదు వారాల క్రితం నిరసనకారులు(Protesters) అధ్యక్షభవనాన్ని చుట్టుముట్టడంతో భారీ హింస చెలరేగింది. పలువురు పోలీసులతో పాటు నిరసనకారులు పెద్దఎత్తున ఆ ఘటనలో గాయపడ్డారు. అందువల్ల ఆ సమయంలో అధ్యక్షుడు గొటబాయ కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. పరిస్థితులు రోజురోజుకూ దిగజారడంతో చేసేది లేక ప్రభుత్వం మరో సారి అదే నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని తెలుస్తోంది.

శ్రీలంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ.. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మేకు దిగాయి. దీనికి తోడు మరోవైపు నిన్న వందల సంఖ్యలో నిరసనకారులు, విద్యార్థులు ఆ దేశ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులతో అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ మరోసారి భద్రతా బలగాలకు అధికారం కల్పించారు. మరోవైపు శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తూ చేయి జారుతున్నాయి. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతోపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతోంది. రానున్న రోజుల్లో అక్కడి పరిస్థితులు మరింతగా దిగజారతాయా అనేది గమనించాల్సి ఉంది.

ఇవీ చదవండి..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

ED Raids: 5 రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. దారి మళ్లిన ఉపాధి హామీ పథకం నిధులు..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే