ED Raids: 5 రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. దారి మళ్లిన ఉపాధి హామీ పథకం నిధులు..

ఈడీ దాడుల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మెషీన్లు తెచ్చింది లెక్కపెడితే 19 కోట్లుగా తేలింది. ఇది ఓ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు.

ED Raids: 5 రాష్ట్రాల్లో ఈడీ దాడులు.. దారి మళ్లిన ఉపాధి హామీ పథకం నిధులు..
Ed Raids
Follow us
Sanjay Kasula

|

Updated on: May 07, 2022 | 6:05 AM

జార్ఖండ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపుదాడులు చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి కేసులో ఈ రెయిడ్స్‌ జరిగాయి. దాదాపు 18 కోట్లు దారి మళ్లాయని అంచనా. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎవరో కాదు. జార్ఖండ్‌ ఐఏఎస్‌ అధికారి పూజా సింఘాల్‌. ఆమె ఇప్పుడు ఆ రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితమైన అధికారి కూడా పేరుంది. పూజా సింఘాల్‌ 2000 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. గతంలో ఖుంటీ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఆమె పనిచేశారు. అప్పుడే ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై జార్ఖండ్‌ విజిలెన్స్‌ బ్యూరో కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ జరిగినట్టు భావించడంలో ఈడీ రంగంలోకి దిగింది. ఖుంటీ జిల్లా జూనియర్‌ ఇంజినీర్‌ రామ్‌ బినోద్‌ ప్రసాద్‌ సిన్హాను అరెస్ట్‌ చేసింది. అతను ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించింది.

పూజా సింఘాల్‌ ఇల్లు, ఆఫీసుతో పాటు జార్ఖండ్‌, బిహార్‌, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్‌, ముంబైలో కూడా పలు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై రెయిడ్స్‌ చేసింది. రాంచీలో పూజా సింఘాల్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ ఇంట్లో 17 కోట్ల రూపాయలను గుర్తించారు. మరోచోట కోటీ 80 లక్షలు దొరికాయి. మెషీన్లు రప్పించి 2000, 500, 200, 100 రూపాయల నోట్లను లెక్కపెట్టారు.

జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..

AP Politics: సీఎం జగన్‌ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..

Minister Srinivas Goud: ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా.. బండి సంజ‌య్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్..