Minister Srinivas Goud: ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా.. బండి సంజ‌య్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్..

తాను రౌడీయిజం చేస్తున్నానంటూ బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌కు చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ఆరేయ్‌... ఒరేయ్‌ అంటే నాలుక కోస్తామని సంజయ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.

Minister Srinivas Goud: ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా.. బండి సంజ‌య్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్..
Bandi Sanjay Vs Srinivas Go
Follow us
Sanjay Kasula

|

Updated on: May 06, 2022 | 4:56 PM

తెలంగాణ రాష్ట్ర బీజేపీ(BJP) అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై(Bandi Sanjay) రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రౌడీయిజం చేస్తున్నానంటూ బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌కు చాలా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. ఆరేయ్‌… ఒరేయ్‌ అంటే నాలుక కోస్తామని సంజయ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. నేను రౌడీయిజం చేస్తే బండి సంజయ్ తిరిగేవాడా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పులి లాంటోడని..కేసీఆర్‌ను ఎవ్వరూ ఓడించలేరని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, మంత్రుల‌ను వాడు, వీడు అంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. మ‌తం, కులం పేరిట రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. 2000లో మూడు రాష్ట్రాలు ఇచ్చిన‌ప్పుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతం పై వివక్ష ప్రదర్శిస్తోంద‌న్నారు. రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజేపీ ప్ర‌భుత్వం కట్టబెట్టింద‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

సిగ్గు, శరం, లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విరుచుకుపడ్డారు. ఆయ‌న‌కు బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చింది ఎవరో అని విమ‌ర్శించారు. సీఎం, మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావా సంజయ్.. అంటూ విరుచుకుపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాజకీయా వార్తల కోసం

ఇవి కూడా చదవండి: Chandrababu: మొన్న మంత్రి చెల్లుబోయిన.. ఇవాళ మరో మంత్రి సీదిరి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు..

Azam Khan: ఇది ‘న్యాయానికి జరిగిన అవహేళన’.. అజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌లో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్..