Chandrababu: మొన్న మంత్రి చెల్లుబోయిన.. ఇవాళ మరో మంత్రి సీదిరి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: May 06, 2022 | 4:03 PM

మొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇవాళ మరో మంత్రి డాక్టర్. సీదిరి అప్పలరాజు. కొద్దిరోజుల కిందట వైవీ సుబ్బారెడ్డికి చెల్లుబోయిన మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తే.. ఇప్పడు బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కారం చేశారు మంత్రి సీదిరి అప్పల రాజు..

Chandrababu: మొన్న మంత్రి చెల్లుబోయిన.. ఇవాళ మరో మంత్రి సీదిరి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు..
Minister Sidiri Appalaraju

మొన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇవాళ మరో మంత్రి డాక్టర్. సీదిరి అప్పలరాజు(Minister Seediri Appalaraju). కొద్దిరోజుల కిందట వైవీ సుబ్బారెడ్డికి చెల్లుబోయిన మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తే.. ఇప్పడు బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) కాళ్లకు నమస్కారం చేశారు మంత్రి సీదిరి అప్పల రాజు. విజయనగరం జిల్లా గరివిడిలో వెటర్నరీ కాలేజ్, స్టూడెంట్స్ హాస్టల్‌ను ప్రారంభించారు మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు. ఈ కార్యక్రమంలోనే సీదిరి అప్పలరాజును సన్మానించారు బొత్స. ఆ వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశారు సీదిరి అప్పలరాజు. పశుగణ క్షేత్ర సముదాయం, విద్యార్థుల వసతి గృహ సముదాయం ప్రారంభించారు మంత్రులు సిదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ.ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఈ పరిణామాలపై తీవ్రంగా మండిపడ్డారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu). ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: TS Inter Exams: కొంపముంచిన ఒక్క నిమిషం నిబంధన.. ఆగమైన ఇంటర్‌ విద్యార్థులు, పరీక్షకు దూరమైన వైనం..

Monkey Fever: అక్కడ కలకలం రేపుతోన్న మంకీ ఫీవర్‌.. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu