KTPP Fire Accident: భూపాలపల్లి కేటీపీపీలో మరో అగ్నిప్రమాదం.. పంప్ మోటార్‌లో చెలరేగిన మంటలు
భూపాలపల్లి(Bhupalpally District) కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. అయితే ఈ సారి కేటీపీపీ(KTPP) స్టేజ్2లోని పంప్ మోటార్ లో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
భూపాలపల్లి(Bhupalpally District) కేటీపీపీలో మరో ప్రమాదం జరిగింది. అయితే ఈ సారి కేటీపీపీ(KTPP) స్టేజ్2లోని పంప్ మోటార్ లో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. కాగా పది రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. దాంతో వరుస ప్రమాదాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా పది రోజుల క్రితం ఇదే కేటీపీపీలో ప్రమాదం జరిగింది. కేటీపీపీ 7 జరిగిన ప్రమాదాన్ని మరిచిపోక ముందే పంపు హౌస్‌లో మంటలు చెలరేగడం కార్మికుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి.
గత నెల 25న జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరు కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. కేటీపీపీలోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లోని రిజెక్ట్ కోల్ మిల్‌లో వర్క్స్ నడుస్తున్నాయి. సోమవారం సాయంత్రం విధులు నిర్వహిస్తున్న కార్మికులు మిల్ లోని డోర్ తిప్పే క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలాన్ని చేరుకుని మంటలు ఆర్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జూనియర్ ప్లాంట్ అటెండెంట్‌తో పాటు మరో ఇద్దరరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.