Terrorist Attack Plan: పాక్ నుంచి డ్రోన్‌ల సహాయంతో పేలుడు పదార్దాలు.. ఆదిలాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పాకిస్తాన్‌లో ప్లాన్..
Terrorist Attack Plan: భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారా? తెలంగాణ(Telangana) కేంద్రంగానే ఉగ్ర దాడికి ప్లాన్ చేశారా? మన దగ్గర రిసివర్స్ ఎవరు? ఉగ్ర లింక్‌లు ఆదిలాబాద్‌లో ఉన్నాయా? ఉంటే ఎవరు? పేలుడు పదార్దాలు పట్టుపడకపోతే నష్టం ఎంత?
భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్ చేశారా? తెలంగాణ(Telangana) కేంద్రంగానే ఉగ్ర దాడికి ప్లాన్ చేశారా? మన దగ్గర రిసివర్స్ ఎవరు? ఉగ్ర లింక్‌లు ఆదిలాబాద్‌లో ఉన్నాయా? ఉంటే ఎవరు? పేలుడు పదార్దాలు పట్టుపడకపోతే నష్టం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు పోలీసులు. దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ(Khalisthani) టెర్రరిస్టులను ఈ ఉదయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్తాన్‌తో లింకులు ఉన్నట్లుగా గుర్తించారు.
నిఘా వర్గాల సమాచారంతో అలర్ట్ అయిన తెలంగాణ, పంజాబ్, హరియాణా పోలీసులు కలిసి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించారు. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో వాహనంలోని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా నిర్దారించారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ నలుగురిని విచారించే పనిలో పడ్డారు. వారు అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు చెప్పడం సంచలనానికి దారితీసింది. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పడంతో మరింత ఆందోళనగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్లు అధికారులు నిర్దారించారు.