Asthma Diet: ఆస్తమాతో బాధపడుతున్నారా..? ఏమి తినాలి? ఏమి తినకూడదు?

పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఆస్తమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా అనేది మీ శ్వాసనాళాలు కుంచించుకుపోయి ఉబ్బి, దానిలో అధిక శ్లేష్మం ఉత్పత్తి అయ్యే పరిస్థితి. ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది.

Asthma Diet: ఆస్తమాతో బాధపడుతున్నారా..? ఏమి తినాలి? ఏమి తినకూడదు?
Asthma Diet
Follow us

|

Updated on: May 05, 2022 | 3:34 PM

పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఆస్తమా (Asthma)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా అనేది మీ శ్వాసనాళాలు కుంచించుకుపోయి ఉబ్బి, దానిలో అధిక శ్లేష్మం ఉత్పత్తి అయ్యే పరిస్థితి. ఇది శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, దగ్గు, ఈల శబ్దం (వీజిల్) అలాగే ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఆస్తమా వల్ల చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆస్తమా అనేది నయం చేయలేని వ్యాధి, కానీ దాని లక్షణాలను నియంత్రించవచ్చు. ఆస్తమా రోగులు ఏమి తినాలి..? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం. కొన్ని పరిశోధనల ప్రకారం, పండ్లు, కూరగాయలు వంటి తాజా ఆహారాలను తినడం ద్వారా ఆస్తమా లక్షణాలను నియంత్రించవచ్చు. దీనికి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనబడనప్పటికీ.. ఈ సమస్యతో బాధపడుతున్నవరిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది.

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది.

ఆస్తమా బాధితులు ఏమి తినాలి.. ఏమి తినకూడదో తెలుసుకుందాం-

ఆస్తమా బాధితులు ఈ ఆహారాలను తమ డైట్ ప్లాన్ లో చేర్చుకోవాలి

ఇవి కూడా చదవండి

విటమిన్ డి- తగినంత విటమిన్ డి పొందడం వల్ల 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలలో ఆస్తమా సంభవం తగ్గుతుంది. ఇవి విటమిన్ డి మూలాలు

  • సాల్మన్ చేప
  • పాలు
  • నారింజ రసం
  • గుడ్లు

విటమిన్ ఎ- 2018 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆస్తమా ఉన్నవారి శరీరంలో విటమిన్ ఎ లోపం ఉన్నట్లు కనుగొనబడింది. శరీరంలో విటమిన్ ఎ లోపాన్ని తీర్చడం ద్వారా ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.

విటమిన్ ఎ వీటిలో లభిస్తుంది-

  • క్యారెట్
  • చిలగడదుంప
  • ఆకు కూరలు
  • బ్రోకలీ

యాపిల్ – రోజూ ఒక యాపిల్ తింటే రోగాలకు దూరంగా ఉంటారు అనే ఈ విషయం మీరు తప్పక వినే ఉంటారు. ఈ సమస్య ఉన్నవారు ఆపిల్ ఆస్తమా రోగులకు కూడా చాలా మంచిదని రుజువు చేస్తుంది. ఇది ఊపిరితిత్తుల పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

మెగ్నీషియం- మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని మీ డైట్ లో తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. మెగ్నీషియం ఈ వస్తువులలో లభిస్తుంది-

  • పాలకూర
  • గుమ్మడికాయ గింజలు
  • డార్క్ చాక్లెట్
  • సాల్మన్

ఆస్తమా బాధితులు వీటిని తినకూడదు-

వీటిని తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో వీటికి దూరంగా ఉండటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం –

సల్ఫైట్స్ మీ ఆస్త్మా సమస్యను మరింత పెంచుతుంది. కొన్ని ఆహారాలలో అధిక మొత్తంలో సల్ఫైట్స్ ఉంటుంది. కాబట్టి ఆస్తమాతో బాధపడుతున్నవారు అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచింది.

  • వైన్
  • పుల్లని పదార్థాలు
  • కీరదోసకాయ
  • నిమ్మరసం లేదా నిమ్మ పానీయాలు

కడుపులో గ్యాస్‌ను తయారుచేసే ఆహారాలు- కడుపులో గ్యాస్‌ను తయారు చేసే వస్తువులను తీసుకోవడం వల్ల డయాఫ్రాగమ్‌పై చాలా ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా మీరు ఛాతీలో బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఆస్తమా సమస్యను పెంచుతుంది. వీటిలో ఈ ఆహారాలు ఉన్నాయి-

  • బీన్స్
  • క్యాబేజీ
  • కార్బోనేట్ పానీయాలు
  • ఉల్లిపాయలు
  • వెల్లుల్లి
  • వేయించిన ఆహారాలు

సాలిసిలేట్స్- ఇది చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఆస్తమా ఉన్న కొందరు వ్యక్తులు కాఫీ, టీ, కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలలో కనిపించే సాల్సిలేట్‌లకు దూరంగా ఉండటం మంచిది.

ఆర్టిఫిషియల్ ఫుడ్స్-  కృత్రిమమైన రంగులు ఉపయోగించిన సిద్ధం చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇలాంటి ఆహారాలను తీసుకోకుండా ఉండటం మంచిది. ఆస్తమా రోగుల సమస్యను పెంచుతుంది. ఇది కాకుండా ఆస్తమా రోగులు ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే