TS Inter Exams: కొంపముంచిన ఒక్క నిమిషం నిబంధన.. ఆగమైన ఇంటర్‌ విద్యార్థులు, పరీక్షకు దూరమైన వైనం..

TS Inter Exams: తెలంగాణలో శుక్రవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష ముగిసింది. అయితే కొందరు విద్యార్థులు మాత్రం పరీక్షకు హాజరు కాలేకపోయారు..

TS Inter Exams: కొంపముంచిన ఒక్క నిమిషం నిబంధన.. ఆగమైన ఇంటర్‌ విద్యార్థులు, పరీక్షకు దూరమైన వైనం..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: May 06, 2022 | 1:51 PM

TS Inter Exams: తెలంగాణలో శుక్రవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజు మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష ముగిసింది. ఫస్ట్‌ ఇయర్ స్టూడెంట్స్‌ మొత్తం 4 లక్షల 64 వేల 626 మంది పరీక్షలు హాజరుకానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ ఏడాది అధికారులు నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి రానివ్వమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రంలోకి అరగంట ముందే అనుమతించేలా అధికారులు కూడా వెసులుబాటు కల్పించారు. దీంతో విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

అయితే కొందరు విద్యార్థులు మాత్రం సమయానికి ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోకపోవడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కలిపి పదుల సంఖ్యలో విద్యార్థులు పరీక్షరాయలేకపోయారు. నిజామాబాద్‌ జిల్లాలో 10 మంది విద్యార్థులు, వేములవాడలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. అధికారులు నిబంధనల మేరకు విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించలేదు.

ఇక వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో కూడా పలువురు విద్యార్థులు తొలి రోజు పరీక్షకు దూరమయ్యారు. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి రావడంతో విద్యార్థులను అనుతమించలేదు. ఆర్టీసీ బస్సు సమయానికి చేరుకోలేదని విద్యార్థులు వాపోయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమి లేక అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. ఈ సంఘటన నేపథ్యంలో అధికారులు మరోసారి విద్యార్థులను సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అరగంట ముందే హాల్‌లోకి అనుమతిస్తున్న నేపథ్యంలో చివరి క్షణాల్లో వచ్చి ఆందోళన పడకుండా, ముందుగానే రావాలని సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: IPL 2022 Purple Cap: చాహల్‌, కుల్దీప్ మధ్య ఒక వికెట్‌ మాత్రమే తేడా.. ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీసినా రేసుకి దూరంగానే..!

Rajasekhar : మీరు ప్రార్ధించి నన్ను బ్రతికించింది ఈ సినిమా కోసమే.. ఎమోషనల్ అయిన రాజశేఖర్

Mahesh Babu: మహేష్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్