Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ పరువు హత్యపై డిటేల్డ్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisa). మతాంతర వివాహం..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ పరువు హత్యపై డిటేల్డ్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisa). మతాంతర వివాహం కారణంగానే నాగరాజు హత్య జరిగినట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ హత్యపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్. హత్యకు గలకారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఇదిలావుంటే.. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులు ముబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
భార్యాభర్తలు బైక్‌పై బయటికొచ్చారు. తెలిసిన వారింటి వెళ్దామని అనుకున్నారు. అంతలోనే ఐదుగురు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. భర్త అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సరూర్‌నగర్లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెళ్లై మూడు నెలలు కూడా గడవకముందే.. వారి దాంపత్య జీవితంలో సొంత సోదరుడే నిప్పులు పోశాడు. సోదరి వేరే మతస్థుడినే కాదు.. ఓ ఎస్సీని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కక్ష పెంచుకుని చివరి నరికి చంపేశాడు సోదరుడు. ఈ కుల మత దురహంకార హత్యలో చనిపోయిన నాగరాజు, అశ్రిన్ అనే యువతిని 3 నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. మంచి జీవితాన్ని ఊహించుకున్న ఈ దంపతులకు రక్త కన్నీరే మిగిల్చాడు.. ఆమె సోదరుడు.
రంగారెడ్డిజిల్లా మర్పల్ మండలం బిల్లాపురం గ్రామాని చెందిన నాగరాజు ఎల్బీనగర్‌లోని ఓ ప్రముఖ కార్ల షో రూమ్‌లో సేల్స్ మేన్‌గా పనిచేసేవాడు. కష్టజీవి. ప్రేమిస్తే ప్రాణమిచ్చే టైపు. అదే మండలంలోని ఘనపూర్‌కు చెందిన అశ్రిన్.. నాగరాజుని నమ్మింది. అతడిపై నమ్మకముంచుకుంది. వీరిమధ్య చిగురించిన ప్రేమ అనతి కాలంలోనే పెళ్లి వరకు వెళ్లింది. ఇరువైపులా కుటుంబ సభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పింది ఈ జంట. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో జనవరి 31న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.
అమ్మాయి సోదరుడు మొబిన్ బెదిరింపులకు దిగాడు. పెళ్లికి ముందే చంపేస్తానని బెదిరించాడు. పెళ్లి తర్వాత కూడా ఆగలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఆ జంట. తమకు ప్రాణభయం ఉందని పదే పదే పోలీసుల ముందు గోడువెళ్లబోసుకున్నారు. పోలీసులు వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. మొబిన్‌తోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. కాని.. ఆ రాక్షసుడు తగ్గలేదు. తన కక్ష్యని రోజు రోజుకు పెంచుకున్నాడు. సోదరి ఓ తక్కువ కులస్థుడిని పెళ్లి చేసుకుందన్న మైండ్‌సెట్‌తో రగిలిపోయాడు. ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు మొబిన్.
మొబిన్.. నాగరాజుని చంపేందుకు కుట్రలు పన్నాడు. సుపారీ గ్యాంగ్‌తో పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా తన సోదరి భర్తని చంపాలని చూశాడు. గత మూడు నెలల్లో నాలుగైదు సార్లు రెక్కీ కూడా నిర్వహించాడు. నాగరాజు సరూర్‌నగర్‌లో గుట్టుగా బతుకుతున్నాడు. భార్యను కాపాడుకుంటూ, తాను జాగ్రత్తగా ఉంటూనే జీవనం సాగిస్తున్నాడు. కాని నాగరాజు బతికి ఉండడం మొబిన్‌కి ఇష్టంలేదు. నిద్రాహారాలు మాని.. తన పరువు గురించే ఆలోచించాడు.
బంధువులు, స్నేహితుల మధ్య తన కుటుంబం పరువు పోయిందని భావించి.. బావని అంతమొందించాలని చూశాడు. పలుమార్లు వివిధ కారణాల వల్ల నాగరాజు బతికిపోయాడు. బుధవారం రాత్రి 9 గంటల ఈ సమయంలో నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బైక్‌పై ఎల్బీ నగర్ నుంచి సరూనగర్ వైపు వెళ్తుండగా.. మున్సిపల్ కార్యాలయం పంజాల అనిల్ కుమార్ కాలనీ వద్ద కొందరు అడ్డగించారు. నాగరాజు వాహనాన్ని ఆపి ఒక్కసారిగా దాడికి దిగారు. ముందు ఇద్దరు తర్వాత ఇద్దరు మొత్తం నలుగురు కలిసి నాగరాజుని అత్యంత కిరాతకంగా నరికి చంపారు.
తెలంగాణ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: Chandrababu: మొన్న మంత్రి చెల్లుబోయిన.. ఇవాళ మరో మంత్రి సీదిరి.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చంద్రబాబు..