AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day 2022: అమ్మను వేదించే మెనోపాజ్‌ బూచి..  ఆ టైంలో ఆమెను ఒంటరిని చేయొద్దు!

వృద్ధాప్యం ముంచుకొచ్చే కొద్దీ అమ్మ ఆరోగ్యం ఏమౌతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? స్త్రీ జీవితాన్ని అలా డిజైన్‌ చేశాడు దేవుడు. వయసు పెరిగే కొద్దీ తల్లులందరూ ఈ సమస్యల నుంచి ఖచ్చితంగా పయణించాల్సిందే. ఈ సమయంలో ఆమె కుంగిపోకుండా ఉండాలంటే..

Mother's Day 2022: అమ్మను వేదించే మెనోపాజ్‌ బూచి..  ఆ టైంలో ఆమెను ఒంటరిని చేయొద్దు!
Mothers Health Care
Srilakshmi C
|

Updated on: May 07, 2022 | 2:50 PM

Share

Ways to support your Mom’s mental and physical health journey: అడుగడుగునా మనల్ని తీర్చిదిద్దడంలో జీవితాన్ని పనంగా పెట్టే అమ్మను సర్‌ఫ్రైజ్‌ చేసే రోజు ఇంకొన్ని గంటల్లో రానుంది. అదేనండీ.. మదర్స్‌ డే (మే 8). అమ్మ ఒడి నుంచి బడికి.. ఆ తర్వాత రెక్కలొచ్చి దూరతీరాలకు ఎగిరిపోతాం. కానీ వృద్ధాప్యం ముంచుకొచ్చే కొద్దీ అమ్మ ఆరోగ్యం ఏమౌతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? స్త్రీ జీవితాన్ని అలా డిజైన్‌ చేశాడు దేవుడు. వయసు పెరిగే కొద్దీ తల్లులందరూ ఈ సమస్యల నుంచి ఖచ్చితంగా పయణించాల్సిందే. ఈ సమయంలో ఆమె కుంగిపోకుండా ఉండాలంటే బిడ్డల ప్రేమానురాగాలు వారికి ఎంతో అవసరం.. సాధారణంగా తల్లులు ఎదుర్కొనే సాధారణ ఆరోగ్య సమస్యలు, నివారణ మార్గాలు మీకోసం..

అమ్మను వేదించే మెనోపాజ్‌ బూచి.. పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత మహిళల మానసిక స్థితిలో మార్పులు రావడం సర్వసాధారణం. ఈ స్థితినే మెనోపాజ్‌ (Menopause) అంటారు. అంటే ఋతు చక్రం శాశ్వతంగా నిలిచిపోతుందన్నమాట. మెనోపాజ్ ప్రారంభ సమమంలో మానసికంగానేకాకుండా శారీరంగానూ అనేక సంకేతాలు కనిపిస్తాయి. చిరాకుగా ఉండటం, నిద్రలేమి (insomnia), యోని పొడిబారడం, బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, బ్రెస్ట్‌ సైజ్‌ తగ్గడం వంటి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా మహిళల్లో మెనోపాజ్‌ 40 ఏళ్ల వయసులో ప్రారంభమౌతుంది.

మెనోపాజ్ ప్రారంభానికి సంబంధించి మరో ముఖ్య లక్షణం ఏంటంటే.. నెలసరి నిలుస్తున్న సమయంలో చర్మం పలు రకాలుగా ప్రభావితమవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్‌ తగ్గడంతో ఈ మార్పులు చోటుచేసుకుంటాయి. కొల్లాజెన్‌ (collagen) ఉత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్‌ తగ్గడంతో చర్మం శాశ్వత మార్పులకు లోనవుతుంది. చర్మం కింద కొవ్వు తగ్గి, సాగే గుణాన్ని కోల్పోతుంది. ఫలితంగా ముఖమంతా పొడిబారి, ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఈ మిశ్రమ మార్పులు ముఖ్యంగా మెడ, దవడ, బుగ్గల చుట్టూ చోటుచేసుకుంటాయి. చర్మం పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతుంది.

మూడు దశల్లో మెనోపాజ్‌.. చివరి రుతుస్రావం తర్వాత వచ్చే 12 నెలల సమయంలో మెనోపాజ్ జీవక్రియ జరుగుతుంది. కానీ కొంతమంది స్త్రీలలో పలు సమస్యల వల్ల ఓవరీస్‌లను శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. అలాగే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ తీసుకున్న మహిళల్లో కూడా త్వరగా మెనోపాజ్‌ సంభవిస్తుంది. ఇటువంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళల్లో మెనోపాజ్ మూడు దశలుగా ఉంటుంది. అవి పెరిమెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్. ఈ విధంగా శస్త్రా చికిత్సలు చేయించుకున్న మహిళలకు 45 ఏళ్లు దాటిన తర్వాత పీరియడ్స్‌ ఆగాయా.. లేదా.. అనేది SR FSH (ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అనే రక్త పరీక్ష ద్వారా నిర్ధించుకోవచ్చు. సాధారణంగా పీరియడ్స్‌ ఆగిపోయిన మహిళల్లో ఎస్ట్రాడియోల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది నెలసరి నిలిచిపోయిన స్త్రీలలో 0 నుండి 30 pg/mL వరకు ఉంటుంది.

కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ముఖ్యం.. మెనోపాజ్‌ (పీరియడ్స్‌ ఆగిపోవడం) సహజమైన ప్రక్రియ అయినప్పటికీ.. మహిళల శరీరంలో శాశ్వత మర్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు ఒక్కరోజులో అకస్మాత్తుగా పెరిగినట్లు అనిపిస్తుంది. మరుసటి రోజుకు గణణీయంగా క్షీణించిన భావన కూడా కలుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వారికి మద్దతుగా నిలిచి, ఈ మార్పులు ఆమె జీవితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించేలా చూసుకోవాలి. దాదాపు మూడు దశాబ్దాలు చురుకైన జీవితాన్ని గడిపిన మహిళలు మెనోపాజ్‌తో కుంగిపోతారు. నిరాశ, ఆందోళన, ఏకాగ్రత దెబ్బతినడం, జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తడంతో కొంత షాక్‌కు గురౌతారు. ఈ సమయంలో కుటుంబ సభులు వారికి అండగా నిలబడగలగాలి. దీంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చెయ్యాలి. కూరగాయలు, తృణధాన్యాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, చేపలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో వచ్చే మార్పులను సులభంగా తట్టుకోవచ్చు. మెనోపాజ్‌లోకి అడుగుపెట్టిన మహిళలకు.. వాకింగ్‌, జాగింగ్, స్విమ్మింగ్, శరీరాన్ని బలపరిచే వ్యాయామాలు ఉత్తమమైనవి. వీటితోపాటు సమతుల ఆహారం తీసుకోవడం మర్చిపోకూడదు.

ఈ టెస్టులు తప్పనిసరి.. మెనోపాజ్‌ మహిళలు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు ఏవంటే.. సర్వికల్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌లను ముందస్తుగా గుర్తించడానికి పాప్‌ టెస్ట్‌, మామోగ్రఫీ టెస్టులను తరచుగా చేయించుకోవాలి. ఫలితంగా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు.

– డాక్టర్ ఇంద్రాణి సలుంఖే, గైనకాలజిస్టు, వోకార్డ్ హాస్పిటల్, ముంబాయి

Source: ఈ కథనం న్యూస్ 9 వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఆర్టికల్ ఆధారంగా రాయడం జరిగింది. ఒరిజినల్ స్టోరీ కోసం క్లిక్ చేయండి.

Also Read:

Pub Vs Club: బార్‌, పబ్‌, క్లాబ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం చేస్తారో తెలుసా..