Mothers Day 2022: అమ్మకు ఆ కష్టమొస్తే.. ఆ సమస్యకు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు..

అమ్మకు సెలవులు లేవు. అమ్మ సమస్యలకు పరిష్కారమే లేదు. మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు.

Mothers Day 2022: అమ్మకు ఆ కష్టమొస్తే.. ఆ సమస్యకు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు..
Mothers Day 2022
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2022 | 9:49 PM

అమ్మకు సెలవులు లేవు. అమ్మ సమస్యలకు పరిష్కారమే లేదు. మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. చాలా సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా అనుమానం వచ్చినా బయటకు చెప్పటానికి సంకోచిస్తుంటారు. దీంతో సమస్యలు మరింత పెద్దగా అవుతాయి. అందువల్ల నిర్లక్ష్యం అమ్మ పట్టించుకోక పోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అమ్మకు ఒక వయసు వచ్చాక మరింత అప్రమత్తత అవసరం. ఆయా సమస్యలను తొలిదశలోనే పట్టుకోవటానికి కొన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బలహీనపడుతుంది. అలాగే మోకాళ్ల నొప్పులు..వెన్ను నొప్పి, కీళ్ల నొప్పి తదితర సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా 50 ఏళ్ల వయసు పైబడిన మహిళల్లో కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, బరువు పెరగడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వారిలో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్.. అంటే క్షీణించిన కీళ్ల వ్యాధి.. అంటే.. వెన్నుముక అరిగిపోవడం.. కీళ్ల నొప్పులు రావడం. మోకాళ్లు.. బరువు మోసే కీళ్లు.. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ (OA) వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ OA కారణం.. మల్టీఫ్యాక్టోరియల్.. (బయోలాజికల్, జెనెటిక్, ఎథ్నిక్, ఎమోషనల్, ఎన్విరాన్ మెంటల్, సైకోసాజికల్).. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

40, 50 ఏళ్ల వయసు పైబడిన మహిళలు నడవలేకపోవడం.. మెట్లు ఎక్కలేకపోవడం.. మోకాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య మరింత పెరగడానికి ముఖ్య కారకం ఊబకాయం. ఇది పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. నెలసరి నిలిచిపోయిన స్త్రీలలో అంటే 50 ఏళ్లకు వయసు పైబడిన స్త్రీలు ఎక్కువగా బరువు పెరుగుతారు. దీంతో వారిలో మోకాలి నొప్పి సమస్యలు వేధిస్తాయి.. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు, వెన్నుముక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అయితే 50 ఏళ్ల మహిళల్లో ఈ హార్మోన్ల లోపం వలన మోకాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య మరింత పెరుగుతుంది.

అలాగే.. పురుషుల కంటే స్త్రీల తుంటి వెడల్పుగా ఉంటుంది. అయితే మహిళలలో మోకాలిపై బరువు ఎక్కువగా పడుతుంది. క్రమంగా ఈ మోకాలి నొప్పులు పెరుగుతాయి. ఇటీవల స్త్రీలు వెన్నుముక పరిమాణం.. సైజు తగ్గించారని అధ్యయానాల్లో వెలువడింది. అంటే ఇది పురుషుల కంటే OA స్థాయికి చేరుకుంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మహిళల జీవనశైలిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళ్లు మెట్లు ఎక్కలేకపోవడం.. ఎక్కువ దూరం నడవలేకపోవడం జరుగుతుంది. క్రమంగా మోకాళి నొప్పులు పెరగడం.. కీళ్ల నొప్పులు వేధిస్తుండడంతో వారి జీవనశైలి మారుతుంది.. దీంతో వేగంగా నడవలేకపోవడం.. చిన్న చిన్న సరదా ఆటలలో పాల్గోనరు. అలాగే పనులు వేగంగా చేయలేరు. దీంతో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను సకాలంలో గుర్తించి అందుకు తగిన చికిత్స చేయడం చాలా ముఖ్యం. అన్ని వయసుల మహిళలలు ఈ OA సమస్యను గుర్తించి.. దానికి సకాలంలో చికిత్స తీసుకోవడం.. జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మహిళలు శరీర బరువును అదుపులో ఉంచేందుకు రోజూ బరువు మోసే వ్యాయమాలు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్, కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్ పెంచడానికి అందుకు తగినంత శరీరానికి ఐరన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో పిల్లలు పాలు ఇవ్వడం.. 50 ఏళ్ల మహిళలు ఎముకలు బలహీనపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

గర్భధారణ సమయంలో మహిళలు బరువు పెరగడం వలన మోకాళ్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ తర్వాత బరువు తగ్గినప్పటికీ మోకాళ్లపై ఒత్తిడి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దీంతో OA సమస్య మరింత తొందరంగా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకే వైద్యుల సలహాలు తీసుకుని రోజూ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవడమనేది మోకాళ్ల నొప్పులను నియంత్రించడానికి ముఖ్యమైనది.

మోకాళ్ల నొప్పిని తేలిగ్గా తీసుకోవడం.. వైద్యులను సంప్రదించకపోవడం వలన ఈ మోకాలి OA సమస్యను తగ్గించడం కష్టమవుతుంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించి చికిత్స చేయకపోతే మరింత తీవ్రమవుతుంది. వెన్నుముక సప్లిమెంట్స్, ఇంట్రాఆర్టిక్యులర్ ఇంజెక్షన్స్ వంటి నాన్సర్జికల్, మోకాలి శస్త్ర చికిత్సలు అనేవి.. ఈ మోకాలి OA సమస్య మరింత పెరగకుండా నిరోధించవచ్చు. ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడం.. చికిత్స ఆలస్యమైనా.. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సకు దారి తీస్తుంది. వయసు పెరిగిన మహిళలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఎక్కువగా నడవలేకపోవడం.. మెట్లు ఎక్కలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం వలన ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను నియంత్రించవచ్చు.

Source:- https://www.news9live.com

గమనిక:- ఈ కథనం డాక్టర్ పునీత్ మిశ్రా.. (అదనపు డైరెక్టర్ & యూనిట్ హెడ్.. ఆర్థోపెడిక్స్, ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్) అభిప్రాయాల మేరకే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Samantha: బాక్సాఫీస్ వద్ద సమంత.. నాగచైతన్య పోటీ.. ఒక్కరోజు తేడాతో..

Suma Kanakala: యాంకరింగ్‏కు సుమ ఫుల్ స్టాప్ ?.. క్లారిటీ ఇచ్చిన సుమ కనకాల..

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..

Ante Sundaraniki: అంటే సుందరానికీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. నజ్రియా భూజాలపై తలవాల్చిన నాని..