AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping Tips: నిద్రలో గురక సమస్య వేధిస్తోందా?.. అయితే ఈ టిప్స్ పాటించి గురకకు చెక్ పెట్టండి..!

Sleeping Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, స్థూలకాయ సమస్యలతో శ్వాసతీసుకోవడంతో

Sleeping Tips: నిద్రలో గురక సమస్య వేధిస్తోందా?.. అయితే ఈ టిప్స్ పాటించి గురకకు చెక్ పెట్టండి..!
Snoring
Shiva Prajapati
|

Updated on: May 06, 2022 | 9:52 PM

Share

Sleeping Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, స్థూలకాయ సమస్యలతో శ్వాసతీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానమైంది గురక. రాత్రి పడుకున్న తరువాత చాలా మంది గురక పెడుతుంటారు. గురక వచ్చే విషయం వారికి తెలియదు. కానీ, పక్కన నిద్రించే వారికి నరకంగా ఉంటుంది. వారి గురక కారణంగా పక్కన వారికి నిద్ర కరువు అవుతుంది. అయితే, ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా మనుషులను బాధిస్తోంది. 30 ఏళ్ల లోపు వారిలో 10 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది గురక పెడుతుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం.. ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరికి, ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంది.

అయితే, అప్పుడప్పుడూ గురక పెడితే అది పెద్ద సమస్య కాదు. కానీ, ఎక్కువ కాలం గురక పెట్టే వారిలో శ్వాస సంబంధిత, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గురకను నిర్లక్ష్యం చేయకూదని సూచిస్తున్నారు. మరి గురక రాకుండా ఏం చేయాలి? ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు నిపుణులు. ఆ టిక్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు గురక ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

గుర‌క ఎందుకు వ‌స్తుంది..? నిద్రపోయే సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గురక వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు ఉన్నాయి. ఇక ప్రధాన కార‌ణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి, అధిక బరువు. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

అల్లం.. అల్లంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అల్లంతో చేసిన పానియాలు తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి. కడుపు నొప్పి, దగ్గు, గుండె సమస్యలు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లంలో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీబాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది గొంతును క్లియర్ చేస్తుంది. రోజుకు రెండుసార్లు అల్లం, తేనెతో టీ తాగితే ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయ.. వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి.. తీసుకుంటే గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు పొడిబారకుండా రక్షిస్తాయి. ఇవి టాన్సిల్స్‌లో వాపును కూడా తగ్గిస్తాయి. స్లీప్ అప్నియాను నివారిస్తాయని ఒక అధ్యయనం పేర్కొంది. ఒకవేళ మీకు వీటి వాసన ప్రాబ్లమ్‌ లేకపోతే.. నిద్రపోయే ముందు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లింగి తింటే గురక సమస్య తగ్గుతుంది. లేదంటే.. రాత్రి భోజనంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగిని తింటే ఫలితం ఉంటుంది.

అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు.. ప్రశాంతమైన నిద్ర గురక సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో మెలటోనిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి అయితే, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అయితే, మెలటోనిన్ కలిగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మెలటోనిన్ కలిగిన వాటిలో అరటిపండు, పైనాపిల్, కమలాపండ్లు ముఖ్యమైనవి. వీటిని తినడం ద్వారా గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు.

సోయా పాలు.. పాల ఉత్పత్తుల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మరింత హానీ తలపెట్టొచ్చు. అందుకే ఆవు, గేదె పాలు, పాల ఉత్పత్తుల బదులు.. ప్రోటీన్స్ కలిగిన సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. వీటిని తీసుకోవడం వలన గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా.. పుదీనా నిద్రలేమి సమస్యను, గురకను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతంది. ముక్కు దిబ్బడ, జలుబు, గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో పుదీనా ఆకులను నానబెట్టి తీసుకోవాలి.

బరువు తగ్గాలి.. గురక సమస్య ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో వస్తుంది. లావుగా ఉండే వారి శ్వాస మార్గం నిద్ర సమయంలో మరింత కుంచించుకుపోతుంది. తద్వారా గురక సమస్య తీవ్రమవుతుంది. అందుకే గురక సమస్యతో బాధపడేవారు బరువు ఉన్నట్లయితే.. బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

గమనిక: ఆయుర్వేద నివేదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఈ చిట్కాలను పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స పొందడం ఉత్తమం.