Black Hole Week: బ్లాక్‌హోల్ నుంచి వింత శబ్దాలు.. బాబోయ్ హార్రర్ మూవీ మ్యూజిక్ అంటున్న నెటిజన్లు
Black Hole Week: విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. మానవ మేధస్సు ఎంత ఎదిగినా... ఖగోళ శాస్త్రజ్ఞులకు (Perseus Galaxy Cluster) ఇంకా అంతుచిక్కని రహస్యం బ్లాక్ హోల్స్..
Black Hole Week: విశ్వంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. మానవ మేధస్సు ఎంత ఎదిగినా… ఖగోళ శాస్త్రజ్ఞులకు (Perseus Galaxy Cluster) ఇంకా అంతుచిక్కని రహస్యం బ్లాక్ హోల్స్.. ఇవి అంతరిక్షంలో ఓ భాగం. ఈ బ్లాక్ హోల్స్‌కు ఉండే గురుత్వాకర్షణ శక్తి ఎంతటిదంటే.. ఒక చిన్న కణం కాదుగదా ఆఖరికి కాంతిలాంటి విద్యుదయస్కాంత వికిరణం కూడా దాని నుంచి తప్పించుకోలేదు. విశ్వంలో ఎన్నో బ్లాక్‌హోల్స్ ఉన్నా పెర్సియస్ గెలాక్సీ క్లస్టర్ మధ్యలో ఉన్న బ్లాక్‌హోల్ మాత్రం చాలా ప్రత్యేకం. భూమినుంచి 240 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఈ బ్లాక్‌హోల్ 2003నుంచి శబ్దాలతో సంబంధం కలిగి ఉంది. తాజాగా, నాసా శాస్త్రవేత్తలు సోనిఫికేషన్ అనే అత్యాధునిక విధానంతో ఈ బ్లాక్‌హోల్ చేస్తున్న శబ్దాలను విడుదల చేశారు.
నాసాకు చెందిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ కనుగొన్న బ్లాక్‌హోల్ డేటాను ధ్వని తరంగాలుగా మార్చారు. సోనిఫికేషన్ ద్వారా మొదటిసారి ఈ బ్లాక్‌హోల్ చేసే శబ్దాలను వినేలా నాసా శాస్త్రవేత్తలు ఆడియోతో కూడిన వీడియోను విడుదల చేశారు. చంద్ర అబ్జర్వేటరీ ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో 161 వేల మంది వీక్షించారు. బ్లాక్ హోల్ శబ్దాలను విన్న నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ కృష్ణబిలం చేసే శబ్దం అచ్చం హార్రర్ సినిమా మ్యూజిక్‌లా ఉందంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ఈ వీడియోలో తమకు పుర్రె కూడా కనిపించిందని చెప్పారు.
New sonifications of well-known black holes have been released for #BlackHoleWeek⚫! #1 The Perseus galaxy cluster — famous for sound waves detected around its black hole by Chandra, some 57 octaves below middle C. And… (1/2) pic.twitter.com/nX1hZe7SPI
— Chandra Observatory (@chandraxray) May 4, 2022
`